Cockfight in Telangana: మంచిర్యాల జిల్లాలో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. కోటపల్లి మండలం బబ్బర చెలుక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన రామగుండం టాస్క్‌ఫోర్స్, కోటపల్లి పోలీసులు మెరుపు దాడులు చేసి 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. 4 పందెం కోళ్లు, 5 కత్తులు, 7 వాహనాలు, 26 సెల్ ఫోన్లు, రూ.1.51వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలోని దండెపల్లి, బెజ్జూర్, జన్నారం, తాండూర్, దహేగాం, వేమనపల్లి, ప్రాంతాలతో పాటు పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి పందెం రాయుళ్లు ఇక్కడికి వచ్చి కోడి పందాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించారు. జిల్లాలోని ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని బబ్బరి చెలుక, దేవులవాడ గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతాల్లో ఈ కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ మహేందర్ వెల్లడించారు. ఈ దాడుల్లో ఎస్సై లచ్చన్న, సిబ్బంది సంపత్, భాస్కర్, శ్రీనివాస్, రాకేష్, శ్యామ్ పాల్గొన్నట్లు తెలిపారు.
గతంలోనూ మంచిర్యాల జిల్లాలో కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. కోటపల్లి మండలంతో పాటు మందమర్రి మండల శివారు ప్రాంతాలు, లక్షెట్టిపేట మండలంలోని పలు గ్రామాలు, జైపూర్, శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల్లో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరాలపై గతంలో మెరుపు దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇక సంక్రాంతి సమయంలో జిల్లాలో కోడి పందాలు మరింత జోరుగా జరుగుతుంటాయి. పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేస్తున్నప్పటికీ.. ఎక్కడో చోట రహస్య స్థావరాలు ఏర్పరుచుకుని పందెం రాయుళ్లు కోడి పందాలు నిర్వహిస్తూనే ఉన్నారు.
Also Read: Nimmala Rama Naidu: సైకిల్ యాత్ర చేస్తూ.. ప్రమాదవశాత్తు జారిపడిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook