Rajalinga Murthy Murder: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. రెడ్డి కాలనీ ఎదురుగా నాగవెల్లి రాజలింగమూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి హత్య చేశారు. రాజ లింగ మూర్తి తన సొంతూరు జంగేడు శివారు పక్కీరుగడ్డలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి టూవీలర్ పై వెళ్లారు అక్కడి నుంచి తిరిగి భూపాలపల్లికి వస్తుండగా.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయపై దాడిచేశారు. ఒక్కసారిగా కత్తులు, గొడ్డళ్లతో నరికారు. తలకు బలమైన గాయంతోపాటు కత్తిపోట్లకు దిగారు. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ హత్యకు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డే కారణమంటూ కాంగ్రెస్ ఆరోపించడం సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే గండ్ర ఖండించారు. తనై కావాలనే కాంగ్రెస్ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల వెనుక స్మితా సబర్వాల్.. ఆమె ఏం చేశారో తెలుసా?
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ రాజలింగమూర్తి కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన హత్యకు గురికావడం రాజకీయంగా సంచలనంగా మారింది. రాజలింగమూర్తిపై గతంలో భూతగాదాల విషయమై పలు కేసులు నమోదయ్యాయి. రాజలింగమూర్తి వార్డు మాజీ కౌన్సిలర్ నాగవెళ్లి సరళ భర్త. ఆమె 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి లోని 15వ వార్డు నుంచి BRS తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందారు. కొద్ది నెలల తర్వాత నాగవెళ్లి సరళను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. అయితే రాజలింగమూర్తిని హత్యలో రాజకీయ నేతల ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆరోపించారు.
Also Read: MLC Elections: తెలంగాణలో మిత్రపక్ష పార్టీల మధ్య చిచ్చు పెట్టిన 'ఎమ్మెల్సీ పోరు'
అటు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డే చంపించినట్లు మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారని చెప్పారు. న్యాయపరంగా కొట్లాడాలి కానీ.. చంపేస్తారా అని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణను దోచుకుందని ఆరోపించారు. వారి అక్రమాలను బయటపెడితే చంపేస్తారా అని నిలదీశారు. అటు మాజీ సీఎం కేసీఆర్‌పై న్యాయపోరాటం చేస్తున్న చక్రధర్‌గౌడ్‌కు రక్షణ కల్పిస్తామన్నారు. కోట్లు పోతే సంపాదించుకోవచ్చు.. ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా అన్నారు. కేసీఆర్ నుంచి ప్రాణభయం ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీపై రాజలింగమూర్తి పోరాడారని అన్నారు. ఆయన హత్య ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తాం అని కోమటిరెడ్డి చెప్పారు.
అయితే కాంగ్రెస్ నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి. రాజలింగమూర్తి మర్డర్ కేసులో మంత్రి ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న అడ్డగోలు ప్రచారాన్ని ఖండించారు. రాజలింగమూర్తి హత్య భూ తగదాల కారణంగానే జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ హత్యకు రాజకీయాలతో ముడిపెడుతున్నారని విమర్శించారు.
మొత్తంమీద రాజలింగం హత్య కేసుపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ హత్యకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చేస్తున్నారట. మరోవైపు రాజలింగమూర్తి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తే.. తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అని కొందరు లీడర్లు కూడ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఏదీఏమైనా ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకోవడం మాత్రం..రాజకీయ నేతలకు ఇబ్బందిగా మారిందని ప్రచారమైతే సాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి