Pushpa2 stampede in Sandhya theatre in Hyderabad: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఎట్టేకేలకు అభిమానుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ మూవీ కోసం ఎన్నో ఎళ్లుగా అభిమానులు వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. పుష్పా మూవీ అదిరి పోయే విధంగా హీట్ అయ్యింది. పుష్ప2 మూవీ కూడా అంత కన్నా ఎక్కువగా హైప్ క్రియేట్ అయినట్లు తెలుస్తొంది.
దీంతో తొలి రోజు తమ ఫెవరెట్ హీరో సినిమా షో చూడాలని చాలా మంది భావిస్తుంటారు. ఈ క్రమంలో పుష్ప2 సినిమా చూసేందుకు వెళ్లిన ఒక ఫ్యామిలీ ప్రస్తుతం రోడ్డున పడినట్లు తెలుస్తొంది. పుష్పా రాజ్ సినిమా చూసేందుకు నిన్న..
దిల్‌షుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ X రోడ్స్ లోని సంధ్య 70ఎంఎంకు వచ్చినట్లు తెలుస్తొంది. అప్పటికే అక్కడ అభిమానులు భారీగా తరలివచ్చారు. అది చాలదన్నట్లు అల్లు అర్జున్ కూడా అక్కడకు రావడంతో.. అభిమానులు ఒక్కసారిగా భారీగా తరలివచ్చినట్లు తెలుస్తొంది. అసలే.. ఒక వైపు అల్లు అర్జున్ అభిమానులు, అశోక్ నగర్ లో నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో మంత్రి ఉంటారు. అయితే.. వీరు కూడా కొన్ని సందర్భాలలో రిలాక్సెషన్ కోసం.. సినిమాలకు వెళ్తుంటారు.
ఈ క్రమంలో అక్కడ విపరీతంగా రద్దీ ఏర్పడినట్లు తెలుస్తొంది. సినిమా హల్ లో వెళ్లే క్రమంలో.. తొక్కిసలాట జరిగింది. రేవతి, ఆమె కొడుకున శ్రీతేజ కింద పడిపోయారు. శ్రీజ అపస్మారకస్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తొంది. రేవతి మాత్రం.. స్పాట్ లోనే చనిపోయినట్లు తెలుస్తొంది. అయిన కూడా.. పోలీసులు విద్యా నగర్ లోని దుర్గా భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు. ఆమెను టెస్ట్ లు చేసిన వైద్యులు.. అప్పటికే రేవతి మృతి చెందిందని చెప్పినట్లు తెలుస్తొంది.
శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే.. తల్లి మృతి.. కొడుకు సీరియస్ కావడానికి ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ కారణమని రేవతి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. మరికొందరు సైతం ఈ ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడేనంటూ ఏకీపారేస్తున్నారు.
Read more: Pushpa 2 The Rule: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో బిగ్ ట్విస్ట్.. నల్లగొండలో అగ్నిప్రమాదం
అసలే..ఈ మూవీకి చాలా జనాలు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ ను అనుమతించడం, సరైన భద్రతను థియేటర్ వద్ద ఏర్పాటు చేయకపొవడంను చాలా మంది తప్పుడపుతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ను కూడాబాధ్యుల్ని చేస్తు కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబానికి కోటి రూాపాల నష్టపరిహాం ఇవ్వాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook