Revanth Reddy: తెలంగాణ పీసీసీకి త్వరలో కొత్త చీఫ్? రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే కుట్ర చేశారా!

Revanth Reddy: సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఆయన పీసీసీ పదవి పోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకే హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగింది. కాని అది టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో కాంగ్రెస్ కు పెద్దగా నష్టం లేకపోయింది

Written by - Srisailam | Last Updated : Oct 21, 2022, 11:32 AM IST
Revanth Reddy: తెలంగాణ పీసీసీకి త్వరలో కొత్త చీఫ్? రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే కుట్ర చేశారా!

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు. పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో ప్రత్యర్థులపై విరుచుకుపడే రేవంత్ రెడ్డికి జనాల్లో ఫాలోయింగ్ ఎక్కువే. రేవంత్ రెడ్డి దూకుడే ఆయనకు ఆయుధం అంటారు. పీసీసీ చీఫ్ గా గత ఏడాది కాలంగా తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపుతున్నారు రేవంత్ రెడ్డి. అయితే మునుగోడు ఉప ఎన్నిక ఆయనకు సవాల్ గా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ చతికిలపడితే.. పార్టీపై తీవ్ర ప్రభావం పడనుంది. అందుకే మునుగోడులో తీవ్రంగా శ్రమిస్తున్నారు రేవంత్ రెడ్డి. కాని మునుగోడులో పరిస్థితులు మాత్రం హస్తం పార్టీకి కసిలిరావడం లేదు. టీఆర్ఎస్, బీజేపీతో పోటీ పడలేక చేతులెత్తేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మునుగోడులో అంతా తానే వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి.. తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నారని.. తనను ఒంటరి చేశారంటూ  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. మునుగోడులో పార్టీని పూర్తిగా బలహీనం చేసి.. ఆ నెపాన్ని తనపై వేసి.. పీసీసీ పదవి నుంచి తనను తప్పించాలని సొంత పార్టీలోనే కొందరు నేతలు కుట్రలు చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించి.. రేవంత్ రెడ్డిని పిసీసీ నుండి తొలగించాలని భారి కుట్ర జరుగుతుందన్నారు. కార్యకర్తలు, అభిమానులు ప్రజలందరూ గమనించాలంటూ వేడుకున్నారు.రేవంత్ రెడ్డి పిసిసిగా ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేందుకే సొంత పార్టీ నాయకులు కేసీఆర్ తో కలిసి కుట్ర చేస్తున్నారని, తొందర్లోనే అన్ని నిజాలు తెలుస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. లాఠీ తూటాలు, తుపాకి గుండ్లకైనా నేను సిద్ధంగా ఉన్నా.. ప్రాణాలు సైతం ఇచ్చేందుకు చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తానంటూ  ఉద్వేగంగా మాట్లాడారు. తనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలిరావలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.తనను ఒంటరివాన్ని చేశారంటూ కన్నీటి పర్వంతమయ్యారు.తన మీద కక్ష ఎందుకు.. పిసిసి పదవి కోసం ఇంత కక్షలా అంటూ  రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఆయన పీసీసీ పదవి పోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకే హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగింది. కాని అది టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో కాంగ్రెస్ కు పెద్దగా నష్టం లేకపోయింది. రేవంత్ రెడ్డి కూడా హుజురాబాద్ ను సీరియస్ గా తీసుకోలేదు. హుజురాబాద్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి నిలబెట్టిన బల్మూరి వెంకట్ కు కేవలం మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈటల రాజేందర్ ను గెలిపించడం కోసమే రేవంత్ రెడ్జి ఎన్నికను సీరియస్ గా తీసుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. హుజురాబాద్ సిట్టింగ్ సీటు కాకపోవడంతో రేవంత్ రెడ్డికి పెద్దగా ఇబ్బంది కాలేదు. కాని ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా 28 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగానే సీట్లు సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి కోటగా చెప్పుకునే మునుగోడులో ఈసారి ఓట్లు తగ్గితే అది పార్టీపై ఖచ్చితంగా ప్రభావం చూపనుంది.

మునుగోడు విషయంలోనూ రేవంత్ రెడ్డితో సీనియర్లకు మొదటి నుంచి విభేదాలు వచ్చాయి. అభ్యర్థి విషయంలో రేవంత్ రెడ్డి వ్యాపారవేత్త చల్లమల్ల కృష్ణారెడ్డి పేరును ప్రతిపాదించగా.. సీనియర్లు మాత్రం పాల్వాయి స్రవంతి పేరు తెరపైకి తెచ్చారు. ఆర్థికంగా బలంగా ఉన్న కృష్ణారెడ్డి అయితేనే బీజేపీ, టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోగలమని రేవంత్ చెప్పినా.. హైకమాండ్ మాత్రం సీనియర్లు సూచించిన స్రవంతికే టికెట్ ఇచ్చారు. అయినా స్రవంతి కోసం ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కాని సీనియర్లు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. స్రవంతికి టికెట్ ఇవ్వాలని హైకమాండ్ ముందు ప్రతిపాదించిన నేతలు కూడా ఇప్పుుడు మునుగోడు వైపు చూడటం లేదు. ప్రస్తుతం ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి అనుచరులుగా ముద్ర పడిన నేతలు మాత్రమే సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కూడా ఏదో వచ్చాం అన్నట్లుగా వచ్చి వెళుతున్నారు తప్ప సీరియస్ గా ప్రచారం చేయడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఏదో  జరుగుతుందున్న  చర్చ సాగుతోంది.

మునుగోడులో కాంగ్రెస్ నేతల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. కొందరు నేతలు కావాలనే మునుగోడు ప్రచారానికి రావడం లేదని, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికే ఇలా చేస్తున్నారనే టాక్ వస్తోంది. మునుగోడులో పార్టీకి ఘోరంగా ఓడిపోతే.. దానిని సాకుగా చూపి రేవంత్ రెడ్డిని బాధ్యుడిన చేయాలనే ప్లాన్ లో కొందరు హస్తం నేతలు ఉన్నారంటున్నారు.ఈ విషయం తెలిసిన రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన సొంత పార్టీ నేతలను టార్గెట్ చేశారని అంటున్నారు. మొత్తంగా తనను పీసీసీ పదవి నుంచి తొలగించాలని చూస్తున్నారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కాక రేపుతుండగా.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

Also read: Munugode Bypoll: ఓట్ల కోసం కోటి తిప్పలు.. యాదాద్రిలో మునుగోడు ఓటర్లకు స్పెషల్ దర్శనం

Also read:  Dhanteras 2022: దీపావళి, ధన్‌తేరస్‌  రోజున ఇలా దీపదానం చేస్తే ఆర్థిక సమస్యలన్నీ చెక్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News