Hyderabad Rains: చలికాలం ముగిసి వేసవి వస్తున్న సమయంలో అనూహ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలుచోట్ల వర్షం పడడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు. అకాల వర్షం కురవడంతో కొంత వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని నిమిషాల పాటు వర్షం పడిందని సమాచారం. ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో అనూహ్యంగా వాతావరణం మారిపోయి నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
Also Read: KCR Meeting: గాయాల నుంచి కోలుకుని పుంజుకోవాలి.. గులాబీ శ్రేణులకు మాజీ సీఎం కేసీఆర్ పిలుపు
హైదరాబాద్ మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో.. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. తీవ్రంగా ఎండ ఉండగా.. అనంతరం వాతావరణం మారిపోయింది. మబ్బులు కమ్ముకుని తేమతో కూడిన గాలులు వీచాయి. అనంతరం చిన్నపాటి వర్షం కురిసింది. నగరంలోని ఎల్బీనగర్, సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, సైదాబాద్, మాదన్నపేట్ ప్రాంతాల్లో చినుకులతోపాటు మోస్తరు వర్షం పడింది.
Also Read: Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరింత ఆలస్యం?
చిన్నపాటి వర్షంతో కొంత వాహనదారులతోపాటు స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం పడుతుండడంతో కొందరు చెట్ల కింద.. దుకాణాల ఎదుట నిలిచిపోయారు. కొద్దిసేపు ఆగిన తర్వాత వాహనదారులు మళ్లీ యథావిధిగా వెళ్లిపోయారు. అయితే అనూహ్యంగా వర్షం కురవడంతో హైదరాబాద్ వాసులు ఆసక్తిగా గమనించారు. ఉన్నఫళంగా.. పైగా వేసవి సమీపిస్తున్న సమయంలో వర్షం పడడం వింతగా అనిపించింది. వేసవికాలంలో అకాల వర్షం అప్పుడప్పుడు కురుస్తుంటుంది. ఈసారి తీవ్రమైన ఎండ వేడిమి ఉండడంతోపాటు అప్పుడప్పుడు ఇలా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడిస్తున్నారు. రానున్న కొన్ని రోజుల్లో ఈదురుగాలులు.. అక్కడక్కడ చిన్నపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి