TS High Court: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలను ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోవిడ్ జాగ్రత్తలు అందరూ పాటించేలా చూడాలని స్పష్టం చేసింది. కరోనాపై మరింత అప్రమత్తం అవసరమని తెలిపింది. వైరస్ బారిన పడి చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ఎలా ఇస్తున్నారన్న దానిపై నివేదిక ఇవ్వాలని తేల్చి చెప్పింది.
కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన కోర్టు..ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది. గతకొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కేసుల సంఖ్య 5 వేల మార్క్ దాటింది. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 29 వేలకు చేరువలో ఉన్నాయి. ఈక్రమంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. వైరస్ పట్ల అప్రమత్తం ముఖ్యమని సూచిస్తోంది.
గడిచిన 24 గంటల్లో 13 వేల 149 నమూనాలను పరీక్షించగా..119 మందిలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అంతకముందు రాష్ట్రంలో 65 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 658కు చేరింది. ఇటీవల హైదరాబాద్‌లో క్రమేపి కేసులు పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం సైతం అలర్ట్ అయ్యింది. మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది.
Also read: Deisel Missing Case: ఏపీఎస్‌ఆర్టీసీ డిపోలో డీజిల్ మాయం..దొంగలు ఎవరో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి