CM KCR's Health condition: హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా నుంచి కోలుకున్నారు. బుధవారం జరిపిన కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో ముఖ్యమంత్రికి నెగటివ్ అని నిర్ధారణ అయింది. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డా. ఎం.వి. రావు (MV Rao) ఆధ్వర్యంలో నిపుణుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించా.. రాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగెటివ్ వచ్చింది. RTPCR test report గురువారం వస్తుందని డాక్టర్ ఎంవి రావు తెలిపారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక (Nagarjuna sagar by-poll) ప్రచారంలో భాగంగా హాలియాలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ఈనెల 19న జరిపిన పరీక్షల్లో సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే, బహిరంగ సభకు వెళ్లి వచ్చినప్పటి నుంచే ఆయన ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లోనే ఉండటంతో కరోనా సోకినట్టు గుర్తించిన అనంతరం వైద్యుల సూచనల మేరకు అక్కడే ఐసోలేషన్ ఉంటూ వచ్చారు. ఈ నెల 21న సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వచ్చి పలు వైద్య పరీక్షలు చేయించుకున్న సీఎం కేసీఆర్ (CM KCR).. ఆ తర్వాత మళ్లీ ఫాంహౌజ్‌కే వెళ్లి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు.
Also read : COVID-19 నుంచి రికవరీ అయినవాళ్లు తీసుకోవాల్సిన Food, ఇతర జాగ్రత్తలు
ఆర్టిపీసీఆర్ పరీక్షలోనూ ఫలితం నెగెటివ్ అని తేలినట్టయితే, సీఎం కేసీఆర్ హైదరాబాద్ ప్రగతి భవన్‌కి వచ్చి COVID-19 వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై పలు శాఖల ఉన్నతాధికారులతో నేరుగా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ (Night curfew)ని మరింత కఠినంగా అమలు చేయాలా లేక కర్ణాటక తరహాలో తాత్కాలికంగా కొన్ని రోజుల వరకు తెలంగాణలో లాక్‌డౌన్ విధించాలా (Lockdown in Telangana) అనే అంశంపై సైతం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని వార్తలు వెలువడుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook