TSPSC: నిరుద్యోగులకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్.. 600 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్..?..

Telangana: తెలంగాణ లో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ స్పీడును పెంచింది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో ఈ ఎగ్జామ్ లో జరిగిన అనేక పొరపాట్ల వల్ల క్యాన్షిల్  అయ్యాయి. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 1, 2024, 03:40 PM IST
  • - నిరుద్యోగులకు కీలక అప్ డేట్..
    - భారీగా పెరగనున్న గ్రూప్ 1 పోస్టులు..
    - కొత్తగా ఏర్పడిన వెకెన్సీలపై ఆరా..
TSPSC: నిరుద్యోగులకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్.. 600 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్..?..

Group 1 Exam Notification Expected Soon: తెలంగాణాలో అధికారంలో వచ్చాక రేవంత్ రెడ్డి సర్కారు ఆరు గ్యారంటీల అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను అమల్లోకి తీసుకు వచ్చారు. అదే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేశారు. దీనిలో భాగంగానే చైర్మన్ గా మాజీ పోలీసు బాస్ మహేందర్ రెడ్డిని నియమించారు.

అదే విధంగా మరికొందరు సభ్యులను కూడా నియమించారు. ఈ క్రమంలో ప్రస్తుతం గ్రూప్ 1 ఎగ్జామ్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే గత ప్రభుత్వం 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ లను విడుదల చేసింది. అదే విధంగా అనేక పర్యాయాలు ఎగ్జామ్ రద్దయ్యింది. ఇదిలా ఉండగా... సీఎం రేవంత్ రెడ్డి ఈ ఖాళీలకు అదనంగా మరికొన్ని పోస్టులు జతపరిచి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

దీనిలో భాగంగానే ఆయా శాఖల నుంచి గత రెండెళ్లలో ఏర్పడిన ఖాళీలు, మరో ఏడాదిలో రిటైర్ మెంట్ అయ్యే వారి ఖాళీల వివరాలు గుర్తించి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. దీంతో గత పోస్టులకు, మరిన్ని పోస్టులు జతపరిచి పోస్టుల సంఖ్యను పెంచనున్నట్లు సమాచారం. అయితే.. గ్రూప్ పోస్టులు 600 వరకు పెరగ వచ్చని కూడా తెలుస్తోంది. నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేయడానికి టీఎస్పీఎస్సీ స్పీడును పెంచినట్లు సమాచారం. 

Read Also: Wedding: ''ఇదేంది భయ్యా ".. పెళ్లి కూతుళ్లంతా తమకు తామే దండలు వేసుకున్నారు... వైరల్ గా మారిన ఘటన..
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News