TG EAPCET 2025 Dates: తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్ 2025 పరీక్షల తేదీలు వచ్చేశాయి. నోటిఫికేషన్ వెలువడింది.ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పరీక్షలు ఏయే తేదీల్లో ఎన్ని దశల్లో జరగనున్నాయి, ఎలా అప్లై చేయాలనే వివరాలు తెలుసుకుందాం.
తెలంగాణలోని అన్ని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్య సంవత్సరం ప్రవేశాలకై నిర్వహించే ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్లు స్వీకరించనున్నారు. జేఈఈ మెయిన్స్ తుది విడత పరీక్షలు ముగిసిన తరువాత అంటే ఏప్రిల్ 29 నుంచి ఈ మూడు విభాగాల పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనున్నాయి. ఇక మే 2 నుంచి మే 5 వరకూ ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి. ఈసారి తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలను జేఎన్టీయూకు అప్పగించారు.
తెలంగాణలోని అన్ని ముఖ్య పట్టణాలతో పాటు ఏపీలో కర్నూల్, విజయవాడలో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకూ ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరిస్తారు.
మరోవైపు తెలంగాణలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు కూడా ఇవాళ విడుదల కానున్నాయి. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చ్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీలో మార్చ్ 1 నుంచే మొదలవుతున్నాయి.
Also read: Election Code Case: ఎన్నికల కోడ్ ఉల్లంఘన, వైఎస్ జగన్ సహా 8 మందిపై కేసు నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి