Vice Chancellors Appointments: అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కొన్ని వారాల్లో ఏడాది పూర్తి చేసుకుంటుండగా ఈ క్రమంలోనే పాలనపై పూర్తి దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించి నియామకాలను పూర్తి చేసింది. రాష్ట్రంలో ఉన్న 9 విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లను నియమిస్తూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు.
విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలు వీరే!
- విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా జీపీ రాజశేఖర్
- కాకినాడలోని జేఎన్టీయూ వీసీగా సీఎస్ఆర్కే ప్రసాద్
- మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ వీసీగా రాంజీ
- కడప యోగి వేమన యూనివర్సిటీ వీసీగా ప్రకాశ్ బాబు
- ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీగా కె ప్రసన్నశ్రీ
- తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీగా ఉమా
- అనంతరపురంలోని జేఎన్టీయూ వీసీగా సుదర్శనరావు
- రాయలసీమ యూనివర్సిటీ వీసీగా వెంకట బసవరావు
- నెల్లూరులోని విక్రమ సింహపురి వీసీగా శ్రీనివాస్ మోహన్
నారీ శక్తి పురస్కార గ్రహీత వీసీ
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ నియమించారు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫ్రొఫెసర్‌గా ఉన్న ఆచార్య ప్రసన్నశ్రీని నన్నయ్య విశ్వవిద్యాలయానికి వీసీగా నియమించడం విశేషం. అంతరించిపోతున్న గిరిజన భాషలను కాపాడుకునేందుకు ఆమె విశేష కృషి చేశారు. ఆమె చేస్తున్న కృషికి మెచ్చిన కేంద్ర ప్రభుత్వం 2022లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 'నారీ శక్తి పురస్కారం' అందించారు.
ఖరగ్‌పూర్ శాస్త్రవేత్త ఏయూ వీసీ
ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమితులైన ప్రొఫెసర్ జీ పీ రాజశేఖర్ ప్రస్తుతం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గణిత శాస్త్ర ఆచార్యుడిగా కొనసాగుతున్నారు. మేధోసంపత్తి కలిగి ఉండడమే కాకుండా దేశంలో గణిత ఆచార్యులుగా గుర్తింపు పొందిన జీపీ రాజశేఖర్‌ను గవర్నర్ అబ్దుల్ నజీర్ వీసీగా నియమించారు. మూడు సంవత్సరాల పాటు ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా రాజశేఖర్ కొనసాగనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.