Samagra Kutumba Survey 2024: సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మరోసారి తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. కుటుంబ వివరాలు అన్ని సేకరించాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. వ్యక్తిగత వివరాలతోపాటు ఆస్తులు.. ఆరోగ్యం తదితర వివరాలు కూడా సేకరిస్తామని ప్రకటించడం కలకలం రేపుతోంది. దీంతోసారి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Revanth Reddy: మొదట కేసీఆర్.. తర్వాత కేటీఆర్.. చివరకు హరీశ్ రావును ఫినిష్ చేస్తా
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ ఆరో తేదీ నుంచి సర్వేను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన నిర్వహించాల్సి ఉండగా.. కులగణనన కాకుండా సమగ్ర కుటుంబ సర్వేకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఒక సర్వే పత్రం బయటకు వచ్చింది. ఆ సర్వే పత్రంలో 56 ప్రశ్నలు, 70కి పైగా అంశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఆ సర్వే పత్రంలో ఆస్తులు, అప్పులు, తినేతిండి, వాడే ఇంధనం వంటి అన్ని వివరాలు కూడా ప్రభుత్వం సేకరించనుంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేగా నామకరణం చేసినట్లు సమాచారం. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమర్ధవంతంగా నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఈ సర్వేపై ఇప్పటికే అధికారులు సమీక్ష చేపట్టారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమర్ధవంతంగా నిర్వహించాలని, ఎన్యుమరేటర్లులు, సూపర్‌వైజర్లు పూర్తి అవగాహన పెంచుకోవాలని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ స్నేహ శబరీశ్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై డిప్యూటీ కమిషనర్లు, సర్కిల్ లెవల్ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకంగా నవంబర్‌లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి కుటుంబానికి సంబంధించి సామాజిక, ఆర్థిక స్థితి, విద్యా స్థాయి, ఉపాధి పరిస్థితులు, రాజకీయ ప్రయోజనం, ఆర్థిక పరిస్థితి వివరణాత్మక సమాచారం సేకరించడమే సర్వే ప్రధాన ఉద్దేశమని స్నేహ శబరీశ్ వివరించారు. సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రజల జీవనస్థితి, అవసరాలు, సమగ్ర సమాచారం చేసి వాటి పరిష్కార మార్గాలను గుర్తిస్తామని తెలిపారు. సర్వే చేసిన ఇంటికి స్టిక్కర్ వేయాలని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook