Rahul Gandhi mishandled with mps at parliament session: పార్లమెంట్ ను దేశంలో అత్యున్నతమైన సభగా భావిస్తుంటారు. అయితే.. అలాంటి పవిత్రమైన పార్లమెంట్ ఆవరణలో ఈరోజు తోపులాట జరిగింది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. బీజేపీ ఎంపీలు ప్రతాప్ సింగ్ సారంగీ, ముఖేష్ రాజ్ పుత్ లు పార్లమెంట్ కు వస్తుండగా.. వీరిని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తోసేసినట్లు తెలుస్తొంది. ఈమేరకు బీజేపీ ఎంపీలు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
#WATCH | Delhi | BJP MP Pratap Chandra Sarangi says, "Rahul Gandhi pushed an MP who fell on me after which I fell down...I was standing near the stairs when Rahul Gandhi came and pushed an MP who then fell on me..." pic.twitter.com/xhn2XOvYt4
— ANI (@ANI) December 19, 2024
ఈ ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. తమ ఎంపీలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దాడిని ఖండించినట్లు తెలుస్తొంది. అయితే.. నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా.. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు దేశంలో పెనుదుమారంగా మారాయి.
అమిత్ షా సభలో మాట్లాడుతూ.. కొంత మంది అంబేద్కర్.. అంబేద్కర్ అంటూ ప్రతి దానికి ఆ పేరు తీసుకొవడం ఫ్యాషన్ అయిపోయిందని, ఇలా ఆ దేవుడి పేరు తల్చుకుంటే.. పుణ్యలోకాలు దొరుకుతాయని కూడా అన్నట్లు తెలుస్తొంది. దీనిపై దేశవ్యాప్తంగా వివాదాం రాజుకుంది. దేశంలో ఉన్న అపోసిషన్ పార్టీలన్ని కూడా .. అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించినట్లు తెలుస్తొంది.
దీనిలో భాగంగానే.. కాంగ్రెస్ నేతలు సైతం నిరసలు వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఈ ఘటనపై బీజేపీఎంపీల ఫిర్యాదు మేరకు పోలీసులు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది. దీనిపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగ ఆందోళనలు మిన్నంటాయని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook