Minister Harish Rao: తెలంగాణలో కరోనా కలవర పెడుతోంది. ఈనేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటింటికి వెళ్లి బూస్టర్ డోస్ పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నిబంధనలు పక్కగా పాటించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాస్క్ తప్పక పాటించేలా చూడాలన్నారు మంత్రి.
సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీజన్ వ్యాధులు, కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. తెలంగాణలో ఇంటింటికి వెళ్లాలని..పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇందుకు ప్రజలంతా అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చారు. త్వరలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
పరిసరాల పరిశుభ్రతపై ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి శుక్రవారం స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తామన్నారు మంత్రి హరీష్‌రావు. ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందిస్తామని..పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తామన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు ఐదు వందలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో 24 వేల 927 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..531 మందిలో వైరస్ బయట పడింది. ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 8.14 లక్షలకు చేరింది. తాజాగా కరోనా వైరస్‌ను 612 మంది జయించారు. మరోవైపు రికవరీ సైతం రెట్టింపు అవుతోంది. ఇప్పటివరకు 8.05 లక్షల మంది కరోనా వారియర్‌గా నిలిచారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4 వేల 630 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి.
hyderabad : కాపాడుతుందన్నా.. కదలరేమన్నా? https://t.co/crgXre1FS8
— Dr G Srinivasa Rao (@drgsrao) July 25, 2022
Also read:Governor Tamili Sai: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాకపోవచ్చు..గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు..!
Also read:Rain Alert: కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..రాగల మూడురోజులు బీఅలర్ట్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.