Konda Surekha Vs KTR: హీరోయిన్ సమంతాపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలపై కోర్టులో విచారణ కంటిన్యూ అవుతోంది. కొండా సురేఖపై భారత రాష్ట్ర సమితి కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారాు) రూ. 100 కోట్లకు పరువు నష్టం వేశారు.తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి తనతో పాటు తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగించారని..మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. కొండా సురేఖకు వ్యతిరేకంగా వీడియోలతో పాటు కీలకమైన మరో 23 రకాల ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేటీఆర్ తరపు సాక్షులుగా బాల్కసుమన్, సత్యవతి రాథోడ్, ఉమ, శ్రవణ్‌ల పేర్లను కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరావు కోర్టులో వాదనలు వినిపించనున్నారు.
మరోవైపు ఇదే కేసులో నాగార్జున.. కొండా సురేఖపై రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా కోర్టుకు నాగార్జున వ్యక్తిగతంగా హాజరయ్యారు. మరోవైపు నాగార్జున మేన కోడలు సుప్రియ కూడా ఈ కేసులో నాగార్జున తరుపున కోర్టులో సాక్షిగా తన వాంగ్మూలం నమోదు చేసింది. మరోవైపు నాగ్ కుటుంబ సభ్యులు కూడా కోర్టులో సాక్షి వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇంత జరిగినా.. కొండా సురేఖ పై కాంగ్రెస్ పార్టీ గానీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె పై ఎలాంటి చర్యలకు దిగలేదు. అంతేకాదు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించనైనా ఖండించలేదు.
ఇక అక్కినేని ఫ్యామిలీ పరువు ప్రతిష్ఠు భంగం కలిగించేలా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మొత్తం సినీ ఇండస్ట్రీ ఏకమై ఒక్కతాటిపై నిలబడ్డారు. అందరు మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుపట్టారు. మరోవైపు ప్రజలు కూడా సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖ తీరుతో పాటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగడుతున్నారు. మరోవైపు హైడ్రా నుంచి ఇష్యూ డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ పెద్దలు ఆమెతో ఈ వ్యాఖ్యలు చేయించినట్టు కూడా తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీపై అనకూడని మాటలతో దాడి చేసిన కొండా సురేఖ తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరింది.
కొండా సురేఖ.. ఓ కార్యక్రమంలో భాగంగా తనపై బీఆర్ఎస్ కేటీఆర్ అండ్ టీమ్ తనపై ట్రోలింగ్ చేయించినట్టు చెప్పడం సబబే. కానీ కేటీఆర్ ను పొలిటికల్ గా విమర్శించడానికి బదులు అన్యంపుణ్యం తెలియని సమంతను ఇందులో లాగి తన పరువు తానే తీసుకుంది కొండా సురేఖ. మొత్తం ఈ వ్యవహారంతో పాటు తెలుగు సినీ పరిశ్రమ రేవంత్ రెడ్డి నంది అవార్డుల స్థానంలో ఇస్తామన్న గద్దర్ అవార్డులను బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.మొత్తంగా కొండా సురేఖ ప్రవర్తనతో కాంగ్రెస్ పార్టీ సినీ ఇండస్ట్రీతో పాటు కామన్ పీపుల్స్ లో పలుచన అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter