తెలంగాణలో మినీ మున్సిపల్ ఎన్నికలలో ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నేటి ఉదయం ప్రారంభమైన వరంగల్ మహా నగరపాలక సంస్థ, ఖమ్మం మున్సిపాలిటీ, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికలకు ఓటింగ్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో హైకోర్టు సైతం ఎన్నికల నిర్వహణపై ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో జరుగుతున్న మినీ మున్సిపాలిటీ ఎన్నికలు కనుక కోవిడ్19 నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. స్ట్రాంగ్ రూమ్‌లలో శానిటైజ్ చేస్తున్నారు. సిబ్బందితో పాటు ఓటర్లు సైతం మాస్కులు ధరించి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్ల మధ్య భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా అనుమానితులకు పీపీఈ కిట్లు ఇచ్చి ఓటింగ్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. మే 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించి, విజేతలను ప్రకటిస్తారు.
Also Read: Cancer Patientsకు COVID-19 సోకితే మరింత ప్రమాదకరం, ఈ విషయాలు తెలుసుకోండి
సిద్ధిపేట 23వ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి హరీష్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో హార్వెస్ట్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓటు వేశారు. వరంగల్ 60వ డివిజన్‌లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Also Read: COVID-19 Cases: తెలంగాణలో నైట్ కర్ఫ్యూలోనూ తగ్గని కరోనా పాజిటివ్ కేసులు
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొండపల్లి తన ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మీరు కూడా బయటకు వచ్చి ఓటు వేయాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో పీజీ కాలేజీ సెంటర్ వద్ద కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దొంగ నోట్లు వేశారని పరస్పరం ఆరోపణలు చేస్తూ ఆపై బాహాబాహీకి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.
ఉదయం 11 గంటల సమయానికి నికిరేకల్ మున్సిపాలిటీలో 45 శాతం, కొత్తూరూలో 44 శాతం, అచ్చంపేటలో 34 శాతం, సిద్ధిపేట మున్సిపాలిటీలో 31 శాతం, వరంగ్ కార్పొరేషన్‌లో 24 శాతం, ఖమ్మం కార్పొరేషన్‌లో 23.4 శాతం ఓటింగ్ నమోదైంది. అక్కడక్కడా కొన్నిచోట్ల ఘర్షణలు చోటుచేసుకుంటున్నా, మొత్తానికి ఇప్పటివరకు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది.
Also Read: Co-Win Registration: కరోనా టీకాలకు రిజిస్ట్రేషన్ ఎక్కడెక్కడ చేసుకోవాలో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook