Revanth Reddy Security Issue: సెక్యూరిటీ తగ్గింపుపై కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy Security Issue: అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారు. ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్‌లో రాస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టం అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

Written by - Pavan | Last Updated : Aug 19, 2023, 05:45 AM IST
Revanth Reddy Security Issue: సెక్యూరిటీ తగ్గింపుపై కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy Security Issue: తనకు సెక్యురిటీని తగ్గించడంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కోర్టు చెప్పినా ప్రభుత్వం తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదన్న రేవంత్ రెడ్డి.. ఎంపీగా ఉన్నాను, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తనకు సెక్యూరిటీ తొలగిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కి కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చామన్న కాంగ్రెస్ నేత.. తాను ప్రజల మనిషినని.. తనకు సెక్యూరిటితో పనిలేదని అన్నారు. తాను సెక్యూరిటీ లేకుండా ఎక్కడికైనా వస్తాను. సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్సిటీలకు కేసీఆర్ రాగలరా ? అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి సవాల్ విసిరారు. 

తనను ఓడించడానికి కేసీఆర్ పోలీసులను వాడుకున్నారు. సెక్యూరిటీ విషయంలో నన్ను భయపెట్టాలని చూస్తే భయపడేవాడ్ని కాదు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలే తన సైన్యమన్న రేవంత్ రెడ్డి.. వాళ్లే తన సెక్యూరిటీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ, మైనార్టీ అనే తేడా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలు చాలా పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ మైనార్టీల కోసం ఏం చేయలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఒక్క పర్సెంట్ కూడా మైనార్టీలకు దక్కలేదు. ఇక్కడ కారు బయల్దేరి ఢిల్లీకి చేరే వరకు అది కమలంగా మారిపోతోంది. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. 

కేసీఆర్ మైనార్టీ ఓట్లను బీజేపీకి అమ్ముకుంటున్నారు కానీ మైనార్టీలు మాత్రం అందరూ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. బీజేపీ తెచ్చిన ప్రతీ ప్రజా వ్యతిరేక బిల్లుకి కేసీఆర్ మద్దతు ఇస్తూ వస్తున్నారు. బీజేపీ ,  బీఆర్ఎస్ పార్టీ రెండూ వేర్వేరు కాదు. రెండూ ఒక్కటే. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడానికి ఎక్కడికైనా వస్తాం. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని గుడి, మసీదు, చర్చి ఎక్కడికైనా వచ్చి చెప్తాం. బీఆర్ఎస్ వాళ్ళు అలా చెప్పగలరా అని కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 

అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారు. ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్‌లో రాస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టం. రెడ్ డైరీలో రాసుకుంటాం అని తాను చెప్పేది ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు, భుజంగ రావు, నర్సింగ్ రావు లాంటి అధికారులనే కాని ప్రజల కోసం పనిచేసే అధికారులని కాదని అన్నారు. ప్రజల కోసం పనిచేసే అధికారులపై తనకి ఎప్పుడూ గౌరవమే ఉంటుంది అని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ప్రభుత్వ అధికారులుగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని అంటున్న వాళ్ల విషయంలో సైలెంటుగా ఎలా ఉంటాం అని రేవంత్ రెడ్డి సందేహం వ్యక్తంచేశారు. అధికారులకు రాజకీయాలతో ఏం సంబంధం ? పది సంవత్సరాల్లో చేయనిది రెండు నెలల్లో ఎలా చేస్తారు ? ఒక్క ఎకరానికి వంద కోట్లు పెట్టగలిగే స్థాయికి బీఆర్ఎస్ నేతలు ఎదిగారు కానీ పేద ప్రజలు మాత్రం పేదలుగానే మిగిలిపోతున్నారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం గుప్పించారు. 

ఇది కూడా చదవండి : YS Sharmila About Dalita Bandhu Scheme: అది దళిత బంధు కాదు.. కేసీఆర్ అనుచరుల బంధు పథకం

కోకాపేట, బుద్వెల్‌లో భూములు కొన్న సంస్థల పేర్లు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. కోకాపేట, బుద్వెల్‌లో భూములు కొన్నది బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ బినామీలే అని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇంకా బూమ్ ఉంది అని జనాన్ని నమ్మించడానికి ఆర్టిఫీషియల్ బూమ్ క్రియేట్ చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు అద్భుతమైన నాటకం ఆడారు అని మండిపడ్డారు. ఇటీవల కోకాపేటలో 10వ నెంబర్ ప్లాట్ లో ఎకరం స్థలం 100 కోట్ల పైనే ధరకు వెచ్చించి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేయగా.. ఆ భూమిని కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ గ్రూప్ కేసీఆర్, కేటీఆర్ బినామిలే అనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి : Double Bedroom Houses Allotment: త్వరలోనే వాళ్లకి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తాం : మంత్రి కేటీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News