Telangana Inter 2nd Year Exams Cancelled: తెలంగాణలో ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్షలు రద్దయ్యాయి. దాంతో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రద్దు చేసినట్లయింది. ఇటీవల తెలంగాణలో పదో తరగతి బోర్డు పరీక్షలను, ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్‌ను రద్దు చేయడం తెలిసిందే. తాజాగా ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో లాక్డౌన్ పొడిగింపు, వర్షాకాలం నేపథ్యంలో రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ లాంటి అంశాలతో పాటు ఇంటర్ సెకండియర్ విద్యార్థుల బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహణపై మంగళవారం నాడు రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఇదివరకే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు కాగా, ఇటీవల ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ సైతం రద్దు అయినట్లు అధికారులు సీఎం కేసీఆర్‌కు, కేబినెట్ మంత్రులకు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గని కారణంగా రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేయాలనే అంశంపై TS Cabinet meetingలో చర్చించినట్లు సమాచారం.
Also Read: TS Cabinet meeting important points:తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు
ఇంటర్ సెకండియర్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దుపై తెలంగాణ ప్రభుత్వం నేటి సాయంత్రం ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఫలితాలు ఏ విధంగా నిర్ణయించనున్నారో, ఆయా వివరాలను తెలంగాణ ఇంటర్ బోర్డ్ (Telangana State Board of Intermediate Education) ప్రకటన చేయనుంది. సెకండియర్ విద్యార్థులు రాష్ట్ర సర్కార్, ఇంటర్ బోర్డు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మార్కులు, గ్రేడింగ్ విధానం వివరాలపై త్వరలో ప్రకటన రానుంది.
Also Read: Special Trains From Secunderabad: నేటి నుంచి 4 ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook