KTR vs Raja singh :తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. పాతబస్తి అభివృద్ధి చేస్తామన్న కేటీఆర్.. తన బైక్‌పై ఆ ప్రాంతంలో తనతో పర్యటించాలని రాజాసింగ్ సవాల్ విసిరారు. దీనికి బదులుగా కేటీఆర్ పెట్రోల్ ధరల పెంపుపై ప్రజలు ఏమనుకుంటున్నారో ఎందుకు తెలుసుకోవట్లేదని కౌంటర్ ఇచ్చారు.
అసలు ఏమైందంటే..
పాత బస్తి అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్లో ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేశారు. తన బుల్లెట్ బైక్‌పై తనతో పాటు.. కేటీఆర్ గోషామహల్, పాతబస్తీల్లో పర్యటించి ఆ ప్రాంతంలో చేసిన అభివృద్ధి గురించి తెలుసుకోవాలని సవాలు విసిరారు.
'అసెంబ్లీలో మన రాష్ట్రం ఎంతో ధనికమైందని పదే పదే అన్నారు. పాత బస్తీని ఎంతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మీరూ నేను.. నా బైక్ పైనే ఆ ప్రాంతంలో పర్యటిద్దాం. ఇందుకు కాస్త సమయం కేటాయించండి. ఎంత అభివృద్ధి చేశారో కలిసి తెలుసుకుందాం. చిన్న వర్షానికే రోడ్లు, దుకాణాలు, ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్తలు పడుతున్నారు. మీరు పర్యటిస్తే అసెంబ్లీలో చెప్పినదానికి, రియాలిటీకి తేడా కూడా తెలుస్తుంది.' అని రాజాసింగ్ అని వీడియోలో పేర్కొన్నారు.
.@KTRTRS Ji let's take a ride on my bullet across #Goshamahal Constituency and old city you will have the 1st hand experience of the development that happened. What say? #HyderabadRains pic.twitter.com/AHPiQM4CxB
— Raja Singh (@TigerRajaSingh) October 16, 2021
Also read: KTR Sensational Comments: గాంధీభవన్‌లోకి గాడ్సేలు దూరారు: మంత్రి కేటీఆర్
Also read: Huzurabad By Election: బీజేపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్
ఈ వీడియోతో కూడిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. తాజాగా రాజాసింగ్‌కు కౌంటర్ వేశారు మంత్రి కేటీఆర్.
'మీరేందుకు పెట్రోల్ బంక్‌ల దగ్గరకెళ్లి.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోకూడదు? ఎవరింటిముందైనా ఆగి.. పెరిగిన వంట గ్యాస్ ధరల ఆ ఇంట్లోని వారి ఏమనుకుంటున్నారో కనుక్కోకుడదు?' అని కేటీఆర్ సమాధానమిచ్చారు.
దీనితో పాటు జీడీపీ పెరుగుతోంది. అయితే జీడీపీ అంటే.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ అని కేటీఆర్ సెటైర్ వేశారు. వట్టి మాటలు పక్కన పెట్టి.. మంచి పనుల ద్వారా హృదాయలను గెలుచుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.
Why don’t you go to petrol bunk & find out what people are saying about hike in Petrol & Diesel prices?
Also stop at a household & enquire with them on how LPG cylinder prices are going up?
GDP ⬆️ = Gas, Diesel, Petrol Suna Hi Hoga?
Ab Yeh Jhumle bandh Karo, Kaam se Dil Jeeto https://t.co/0vhy4BYjyX
— KTR (@KTRTRS) October 23, 2021
Also read: Bathukamma: బుర్జ్ ఖలీఫా స్క్రీన్‌పై తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ వైభవం
Also read: Gorrela pampini: గొర్రెల పంపిణీకి తేదీ ప్రకటించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook