BJP MLAs Raghunandan Rao, Raja Singh to join BRS ?: బీజేపీలో ట్రిపుల్ R గా పేరు తెచ్చుకున్న డైనమిక్ ఎమ్మెల్యేస్ లో వీరు ఇద్దరు పార్టీలో తమ గళాన్ని గట్టిగ వినిపించి ఇప్పుడు ఒక్కసారిగా మౌనం పాటిస్తున్నారు. రఘునందన్ రావు ఒక పదవిపై కన్నువేయడం, రాజసింగ్ నోటి మాటల వలెనే బీజేపీ అధిష్టానం వీరిని పక్కన పెట్టినట్టు సమాచారం. దీనికి వారిలో అసంతృప్తి కారణమా ? సరైన గుర్తింపు లేకపోవడమా ?
Bandi Sanjay About Raja Singh: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి బీజేపీనే పోటీ ఇస్తుందని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపినే ప్రత్యామ్నాయం అని బండి సంజయ్ పేర్కొన్నారు. రాజాసింగ్ పై హైదరాబాద్ పోలీసులు మోపిన పీడీ యాక్టును తెలంగాణ హై కోర్టు కొట్టేయడాన్ని గుర్తుచేస్తూ బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
BJP MLA Raja Singh released: ఎమ్మెల్యే రాజా సింగ్ జైలు నుంచి విడుదలై బయటికొచ్చారు. ప్రొఫెట్ మహ్మద్‌ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన తర్వాత 76 రోజులకు రాజా సింగ్ విడుదలయ్యారు.
MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో తాజాగా మరో కలకలం రేగింది.బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తరపున హైకోర్టులో వాదించిన లాయర్ కు బెదిరింపులు వచ్చాయి.
MLA RAJA SINGH: ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. రాజాసింగ్ కు వ్యతిరేకంగా సోమవారం పాతబస్తీలో ఎంఐఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మంగళ్ హాట్ పీఎస్ లో నమోదైన కేసులో రాజాసింగ్ ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే అరెస్ట్ సమయంలో 41 సీఆర్పీసీ, సుప్రీంకోర్ట్ నియమాలు పాటించలేదని రాజాసింగ్ తరపు లాయర్లు వాదించారు. ఈా వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. రాజాసింగ్ రిమాండ్ రిపోర్టును కొట్టివేసింది.
MLA RAJA SINGH: వివాదాస్పద వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ హైకమాండ్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. సమాధానం ఇచ్చేందుకు 10 రోజుల గడువు ఇచ్చింది. రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు అతనికి ఉన్న అన్ని పదవులను రద్దు చేసింది బీజేపీ హైకమాండ్.
Raja Singh Gets Bail : బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్‌కి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రొఫెట్ మొహమ్మద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్‌పై ముస్లిం సోదరులు మండిపడుతున్నారు.
MLA RAJA SINGH ARREST: హైదరాబాద్ లో హై టెన్షన్ కొనసాగుతోంది. గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. రాజాసింగ్ ను అతని నివాసంలో అదుపులోనికి తీసుకున్నారు సౌత్ జోన్ పోలీసులు
Munawar Faruqui: ఫేమస్ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకి హైదరాబాద్ షోపై సస్పెన్స్ కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో షో జరగాల్సి ఉంది. అయితే మునావర్ ఇంకా హైదరాబాద్ రాలేదు. ఆయన వస్తున్నారా లేదా అన్నదానిపై క్లారిటీ రావడం లేదు.
BJP MLA Raja Singh: యూపీ ఓటర్లను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరించారని పేర్కొంటూ...ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.
BJP MLA Raja Singh: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. వెంటనే దేవి.. హిందూవులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Twitter War: పాత బస్తిలో బైక్‌పై పర్యటించాలని ట్విట్టర్లో తనకు సవాలు విసిరిన ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల గురించి ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు.
Etela Rajender to join BJP: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని ఆయనతో పడని బీజేపి నేతలు అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ (BJP MLA Raja Singh) తనదైన స్టైల్లో స్పందించారు.
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) అకౌంట్‌పై ఫేస్బుక్ నిషేధం విధించింది. రాజా సింగ్ పేరుతో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఉన్న వ్యక్తిగత ఖాతాలను నిషేధించింది.
తెలంగాణ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (T. Raja Singh) కు పోలీసులు భద్రతను పెంచారు. నిఘావర్గాల నుంచి వచ్చిన హెచ్చరికల మేరకు హైదరాబాద్ పోలీసులు (TS Police) అప్రమత్తమయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.