BJP MLA Raja Singh released: బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ చర్లపల్లి జైలు నుండి విడుదలై ఇంటికి చేరుకున్నారు. రాజా సింగ్ పై హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన పిడి యాక్టును రద్దు చేస్తూ తెలంగాణ హై కోర్టు ఇవాళ ఉదయం ఆదేశాలు జారీ చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. రాజా సింగ్ భార్య ఉషా బాయి, ఆయన తరపు న్యాయవాది కరుణ సాగర్, ఇంకొంత మంది కుటుంబసభ్యులు, సమీప అనుచరులు చర్లపల్లి జైలు వద్దకు చేరుకుని రాజా సింగ్ కి స్వాగతం పలికారు. రాజా సింగ్ జైలు నుంచి విడుదలవుతున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు భారీ సంఖ్యలో చర్లపల్లి జైలు వద్దకు చేరుకున్నారు. బుధవారం ఉదయం హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా.. సాయంత్రం ఆ ఆదేశాలు అందుకున్న చర్లపల్లి జైలు అధికారులు తక్షణమే ఆయన్ని విడుదల చేశారు.
చర్లపల్లి జైలు నుంచి విడుదలైన రాజా సింగ్ పాతబస్తీ మంగళహాట్ లోని తన నివాసానికి చేరుకున్నారు. రాజా సింగ్ రాక సందర్భంగా ఎమ్మెల్యే మద్దతుదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజాసింగ్ కి జై కొట్టిన అనుచరులు, మద్దతుదారులు, బీజేపి కార్యకర్తలు.. భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదిలావుంటే, రాజాసింగ్ పై పీడీ యాక్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన హై కోర్టు.. అదే సమయంలో ఆయనపై పలు ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా ఎలాంటి చర్యలకు పూనుకోరాదని, మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపించేలా పోస్టులు చేయరాదని హై కోర్టు స్పష్టంచేసినట్టు సమాచారం. తన విడుదలపై విజయోత్సవ ర్యాలీలు చేపట్టడం, మీడియాతో మాట్లాడటం, సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వంటి పనులకు దూరంగా ఉండాల్సిందిగా హై కోర్టు షరతులు విధించినట్టు తెలుస్తోంది. మరోవైపు రాజాసింగ్ రాక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతూ మంగళహాట్ పోలీసులు ముందే రాజాసింగ్ ( BJP MLA Raja Singh ) ఇంటికి చేరుకుని శాంతి భద్రతల పరిస్థితిని పరిశీలించారు.
Also Read : TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో సిట్ ఏర్పాటు.. స్టీఫెన్ రవీంద్ర ఎక్కడ ?
Also Read : MLA Raja Singh PD act: రాజా సింగ్ కు బెయిల్ కాదు.. పీడీ యాక్ట్ రద్దు.. అసలు విషయం ఇదీ!
Also Read : Revanth Reddy Birthday Special: రేవంత్ రెడ్డి బర్త్‌డే స్పెషల్.. రియల్ లైఫ్ స్టోరీలో ఆసక్తికరమైన అంశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook