విద్వేషపూరిత కామెంట్లు, వీడియోలు పోస్టులపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నిఘా పెట్టి చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) అకౌంట్‌పై ఫేస్బుక్ నిషేధం విధించింది. రాజా సింగ్ పేరుతో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఉన్న వ్యక్తిగత ఖాతాలను నిషేధించింది. రాజా సింగ్ పేరుతో ఉన్న పలు ఖాతాలను తొలగించారు. మతపరమైన, దేశానికి సంబంధించిన పలు అంశాలపై ఎమ్మెల్యే రాజా సింగ్ పలు సందర్భాలలో సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. AP ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
Anchor Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు
రెచ్చకొట్టడం, వివాదాస్పద వ్యాఖ్యలు, ద్వేష పూరిత అంశాల విషయంలో ఫేస్బుక్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా సంస్థ గుర్తించింది. హింసను ప్రేరేపించే అంశాలకు, వ్యక్తులకు తామెప్పుడూ మద్దతు తెలపబోమని ఫేస్బుక్ మరోసారి స్పష్టం చేసింది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హింసను ప్రేరేపించే విధంగా పలు పోస్టులు చేశారని ఫేస్బుక్ ప్రతినిధులు పేర్కొన్నారు. నిబంధనలు పలుమార్లు ఉల్లంఘించడంతో రాజా సింగ్ ఫేస్బుక్ ఖాతాలను నిషేధించినట్లు వివరించారు. IPL 2020: యూఏఈలో మరోసారి కరోనా కలకలం
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics
Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్