Uttar Kumar Reddy:. అర్ధరాత్రి గలీజ్ మెస్సెజ్‌‌లు.. ఉత్తమ్ కుమార్ పీఎ అంటూ రాత్రి ఫోన్ కాల్స్.. ఎక్కడంటే..?

Fake uttar kumar pa case: మంత్రి ఉత్తమ్ కుమార్ పీఏ నంటూ ఒక ఆగంతకుడు అనేక మంది మహిళలకు కాల్స్ చేసిన ఘటన ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు కూడా పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి..

Written by - Inamdar Paresh | Last Updated : Nov 3, 2024, 01:33 PM IST
  • ఉత్తమ్ పేరుతో పాడుపని..
  • చంపుతానని బెదిరింపులు..
Uttar Kumar Reddy:. అర్ధరాత్రి గలీజ్ మెస్సెజ్‌‌లు.. ఉత్తమ్ కుమార్  పీఎ అంటూ రాత్రి ఫోన్ కాల్స్.. ఎక్కడంటే..?

Fake Uttar kumar reddy pa phone calls: తెలంగాణలో ఇటీవల కాలంలో కొంత మంది నేతలు తరచుగా వార్తలలో ఉంటున్నారు. కొందరు వివాదాస్పద అంశాలను మాట్లాడుతూ వార్తలలో ఉంటే, మరికొందరు మాత్రం కొంత మంది వాళ్లను టార్గెట్ గా చేసుకుని ప్రజల్లో చెడ్డపేరు తెచ్చే విధంగా రూమర్స్ లను వ్యాప్తి చేస్తున్నారు.  ఈ క్రమంలోనే తాజాగా, తెలంగాణకు చెందిన సీనియర్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీఏ నంటూ కూడా ఒక ఆగంతకుడు మహిళలకు ఫోన్ లు చేసి బెదిరిస్తున్నాడంట. అంతే కాకుండా.. తాను మంత్రికి దగ్గరగా ఉంటానని, ఎలాంటి సమస్యలు ఉన్నతనతో చెప్పాలని కూడా సదరు వ్యక్తి కోదాడలోని అంగన్ వాడి సూపర్ వైజర్ కు కాల్ చేశాడు.

అంతే కాకుండా.. తమకు కోదాడలోని మహిళ అంగన్ వాడి ఉద్యోగినులు, సూపర్ వైజర్ ల నంబర్ లు ఇవ్వాలని చెప్పడంతో కోదాడకు చెందిన అధికారిణి ఆగంతకుడు నరేష్ కు డిటెయిల్స్ ఇచ్చిందంట. అప్పటి నుంచి ప్రతిరోజు రాత్రి పూట పదుల సంఖ్యలో ఫోన్స్ చేస్తు అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తుండేవాడంట. తాజాగా, మహిళ సూపర్ వైజర్ వేధింపులు భరించలేక కోదాడలోని లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది.

అయితే.. సదరు నిందితుడు మాత్రం.. బరితెగించి నన్నేవరు ఏం పీకలేరు.. ఇటీవల జైలు నుంచి వచ్చానని, నిన్ను హత్య చేసి మళ్లీ జైలుకు సైతం వెళ్తానని, నువ్వుండే అడ్రస్ ను ట్రేస్ చేసి  మరీ వచ్చి, నీ తలకాయ పగలకొట్టి జైలుకు వెళ్తానని అన్నాడంట. దీంతో మహిళ భయంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తొంది. అయితే.. పోలీసులు మాత్రం అంత పాజిటివ్ గా రెస్పాండ్ కాలేదని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.

Read more: Aghori naga sadhu: అఘోరీకి బిగ్ షాక్.. తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసిన లాయర్..

కొంత మంది పోలీసులు మాత్రం.. ఆ నిందితుడు చర్లపల్లి నుంచి బెయిల్ పైన బైటకు వచ్చాడని, అతను సైకోలాగా ప్రవర్తించే వాడని చెప్తున్నాడంట. అతనికి హెచ్ఐవీ సైతం ఉందని చెప్తున్నారంట. దీన్ని బట్టి చూస్తే పోలీసులకు ఆ నిందితుడు ఏవరో తెలుసని, కానీ అరెస్ట్ చేయడంలో మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కూడా పలువులు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News