Godavari Floods: Minister Puvvada Ajay Kumar key comments about polavaram project hight. గోదావరి వరదల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గోదావరి వరదల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని మొదటి నుంచి తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదలడం ఆలస్యం కావడం వల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందని చెప్పారు. భద్రాచలం ప్రాంతాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.