దక్షిణ ఫిలిప్పీన్స్లోని దావో ప్రాంతంలో గల ఒక షాపింగ్ మాల్లో అనుకోకుండా అగ్నిప్రమాదం సంభవించడం వల్ల దాదాపు 37 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోందని ఆ నగర మేయర్ ప్రకటనను జారీ చేశారు. నాలుగు అంతస్తుల ఆ మాల్లో ఒక కాల్ సెంటర్ను కూడా గతకొంతకాలంగా నడుపుతున్నారని.. ప్రమాద సమయంలో బయటకు వెళ్లే దారి తెలియకపోవడంతో అందరూ అగ్నికి ఆహుతయ్యారని పోలీసులు అంటున్నారు.
మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించినా.. అదే అంతస్తులో ఎక్కువగా ఉన్ని దుస్తులు, చెక్క సామాను, ప్లాస్టిక్ వస్తువులు ఉండడం వల్ల వేగంగా మంటలు వ్యాప్తి చెందాయని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు భావిస్తున్నారు. ప్రమాదం సంభవించే సమయానికి కాల్ సెంటర్ ఉద్యోగులు తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఉన్నారని.. వారు తేరుకొని బయటకు వచ్చేలోపే మంటలు మొత్తం వ్యాపించాయన్నది పోలీసుల కథనం. ఈ ఘటనలో మరణించిన వారిలో ఎక్కువమంది ఆ కాల్ సెంటర్ ఉద్యోగులే ఉండడం గమనార్హం.