Afghanistan Issue: ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించిన తరువాత మారుతున్న పరిణామాలతో ప్రజలు దేశాన్ని వీడుతుండటంపై సమితి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan)పరిణామాలు మారుతున్నాయి. తాలినబన్లు దేశాన్ని ఆక్రమించిన తరువాత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పెద్దఎత్తున జనం దేశం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలామంది దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి(UNO)చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఆఫ్ఘన్‌లో మరో 5 లక్షలమంది వరకూ ప్రజలు దేశాన్ని వీడే అవకాశాలున్నాయని ఐక్యరాజ్యసమితి శరణార్ధుల విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే దేశంలో అనిశ్చితి కొనసాగుతోందని..రానున్న రోజుల్లో పరిస్థితులు మరింతగా దిగజారనున్నాయని తెలిపింది. 5.15 లక్షలమంది ప్రజలు శరణార్ధులుగా మారే ప్రమాదముందని పేర్కొంది. ఆఫ్ఘన్ శరణార్జులకు(Afghan Refugees) ఆహారంతో పాటు తగిన వసతులు కల్పించేందుకు 30 కోట్ల డాలర్లు అవసరమని అంచనా వేసింది. ఇప్పటికే ఇరాన్, పాకిస్తాన్ వంటి దేశాల్లో 22 లక్షలమంది ఆఫ్ఘన్ శరణార్ధులుగా నమోదై ఉన్నారని తెలిపింది.
ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలి, దేశంలో హింస ప్రజ్వరిల్లడంతో ఆ ప్రభావమంతా సాధారణ పౌరులపై పడుతోందని..ఈ క్రమంలో ఉన్న ప్రాంతాన్ని వదిలేసి మరో సురక్షిత ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారని ఐక్యరాజ్యసమితి(UNO) ప్రతినిధి తెలిపారు. అంతర్యుద్ధం కారణంగా ఏడాదిలోనే 5.58 లక్షలమంది తరలిపోయాని అంచనా వేశారు. ఈ శరణార్ధుల్లోని ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలు, చిన్నారులు కావడం విశేషం. ఆప్ఘన్ ప్రజలకు రానున్నవి చీకటి రోజులని ఆవేదన వ్యక్తం చేశారు.
Also read: Kabul Airport Attack: "దాడికి కారణమైన వారిని వదిలిపెట్టబోము": జో బైడెన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook