Indo Pak war : తాట తీయండి..కానీ శాంతించండి; ఇండో పాక్ వార్ పై ట్రంప్ రియాక్షన్

                            

Last Updated : Feb 28, 2019, 05:06 PM IST
Indo Pak war : తాట తీయండి..కానీ శాంతించండి; ఇండో పాక్ వార్ పై ట్రంప్ రియాక్షన్

భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై స్పందించారు. వియత్నం పర్యటనలో భాగంగా హనోయి లోని నిర్వహించిన ప్రెస్ మీట్ లో ట్రంప్ మాట్లాడారు. ఉగ్రమూలను ఏరివేరేందుకు ప్రపంచంలో ఏ దేశానికైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రస్తుత తరుణంలో భాతర దేశం చేస్తున్న పోరాటం న్యాయబద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు.

ఉగ్రమూలపై పోరు..ఇరు దేశాల పోరుకి దారి తీయకూడదని తాము భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ పాక్ ఇరుదేశాలు సంయమనం పాటించాల కోరారు.  ఇరుదేశాల మధ్య  నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుతాయని భావిస్తున్నా...భారత్ పాక్ నుంచి శాంతి సందేశం  వినాలనుకుంటున్నానని పేర్కొన్నారు.

ఈ రోజు అమెరికా విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ కార్యదర్శి అజిత్ ధోవల్ సమావేశయ్యారు. ఈ నేపథ్యంలో జరగుతున్నపరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అజిత్ ధోవల్ వివరణ అనంతరం  ఉగ్రపోరులో భారత్ కు తమ సంపూర్ణ సహాకారం ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. అలాగే ఉగ్రమూల ఏరివేతలో పాక్ కఠినంగా వ్యహించాలని పాకిస్తాన్ ను కోరారు. ఈ భేటీ జరిగిన కొన్ని గంటలకే ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.

Trending News