H1B Visa: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్ 1 బీ వీసా విధానంపై గుడ్‌న్యూస్ అందిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ విధించిన నిషేధాన్ని కొనసాగించకూడదనేది జో బిడెన్ ఆలోచనగా ఉంది. ఇదే జరిగితే భారతీయ ఐటీ నిపుణులకు ఊరట కల్గించే విషయమే మరి.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్ 1 బీ వీసాలపై నిషేధం ( H1B Visa) విధించి..కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ నిషేధానికి విధించిన కాల వ్యవధి నిన్నటితో ముగిసింది. ఈ నిషేధాన్ని పొడిగించకూడదని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భావిస్తున్నారు. నిషేధం కారణంగా టెక్ కంపెనీలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా నిషేధం తొలగిపోవడం, నిషేధాన్ని బిడెన్ వద్దని నిర్ణయించడం టెక్ కంపెనీలకు ముఖ్యంగా భారతీయ కంపెనీలకు మేలు చేకూర్చే అంశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంకా ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడలేదు. కొందరు అధికారులు మాత్రం నిషేధాన్ని వెంటనే తొలగిస్తే అమెరికా కంపెనీలకు నష్టం వాటిల్లుతుందని..నెమ్మదిగా తొలగించాలని అంటున్నారు.
మరోవైపు కరోనా వైరస్ (Corona virus) కారణంగా డోనాల్డ్ ట్రంప్ కొత్త గ్రీన్‌కార్డుల్ని (Green Card) జారీ చేయకూడదని నిర్ణయించారు. ఈ ఆదేశాల్ని జో బిడెన్ ( Joe Biden) రద్దు చేశారు. ఇలాంటి నిర్ణయాలు అమెరికాకు, ఆర్ధిక వ్యవస్థకు ప్రతికూలమని బిడెన్ వ్యాఖ్యానించారు. రానున్న ఆర్ధిక సంవత్సరానికి హెచ్1బీ విదేసీ వర్కర్ వీసాల పరిమితి పూర్తయినట్టు అమెరికా వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక రిజిస్ట్రేషన్‌లో కావల్సినన్ని దరఖాస్తులు వచ్చాయని తెలిపింది. అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లే భారతీయ ఐటీ నిపుణులకు ఇది చాలా కీలకం. ఈ వీసాల కోసం సరైన ఆధారాలతో సమర్పించిన దరఖాస్తుల్ని పరిశీలించి లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తామని యూఎస్‌సీఐఎస్ తెలిపింది.
Also read: Covaxin: కోవ్యాగ్జిన్ ప్రమాణాలకు అనుగుణంగా లేదంటున్న బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook