China Vaccination: కరోనా నియంత్రణకై డ్రాగన్ దేశం సరికొత్త చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో తొలిసారిగా కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో కరోనా వైరస్ కేసులు తిరిగి పెరుగుతుండటమే చైనా నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా రష్యా, చైనా, అమెరికాతో పాటు పలు ఇతర దేశాల్లో కరోనా సంక్రమణ (Corona Virus)తిరిగి వేగం పుంజుకుంటోంది. రష్యాలో అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రోజుకు 40 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. అటు మరణాల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో చైనాలో(China)సైతం కొత్తగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. కరోనా సంక్రమణ పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి చైనా కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో ఇక నుంచి మూడేళ్ల చిన్నారులకు సైతం కోవిడ్ వ్యాక్సిన్(China to vaccinate 3 years children)ఇవ్వాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. చైనాలోని ఐదు ప్రావిన్స్‌లలో 3-11 ఏళ్ల చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వనుంది. హుబే, పుజియాన్, హెనాన్, జెజియాంగ్, హునాన్ ప్రావిన్స్‌లలో అధికార యంత్రాంగం ఈ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన సినోఫాం(Sinopharm), సినోవాక్ వ్యాక్సిన్‌లకు ఈ మేరకు అనుమతులు జారీ అయ్యాయి. ఈ వ్యాక్సిన్లను చిలీ, అర్జెంటీనా, కాంబోడియా దేశాల్లో కూడా చిన్నారులకు అందిస్తున్నారు. అయితే మూడేళ్ల చిన్నారులకు ఇవ్వడం ఇదే ప్రధమమని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా 140 కోట్లున్న చైనాలో ఇప్పటి వరకూ వందకోట్లకు పైగా అంటే 76 శాతం మందికి సినోఫాం, సినోవాక్ వ్యాక్సిన్లు పంపిణీ అయ్యాయి. కరోనా నియంత్రణలో ఈ రెండు వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ (Delta Variant)విషయంలో మాత్రం స్పష్టత లేదు. అయితే చైనా మాత్రం తాము దేశీయంగా అభివృద్ధి చేసిన సినోవాక్(Sinovac),సినోఫాం వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్ నుంచి కూడా రక్షణ కల్పిస్తున్నాయని చెబుతోంది.
Also read: Russia Covid: రష్యాలో కరోనా కల్లోలం...రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook