China vs America: డ్రాగన్‌దేశం మరోసారి అగ్రరాజ్యంపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించింది. అమెరికా ఆధిపత్యాన్ని సహించేది లేదంటోంది. ఐక్యరాజ్యసమితి చట్టాలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనంటోంది. అసలేం జరిగిందంటే.
అమెరికా వర్సెస్ చైనా(America vs China). సందర్భం లభించిన ప్రతిసారీ ఇరు దేశాలు విమర్శలు చేసుకుంటుంటాయి. ప్రపంచ మార్కెట్‌ను క్యాప్చర్ చేస్తున్న చైనాకు అగ్రరాజ్యం అమెరికాకు గత కొద్దికాలంగా సరిపడటం లేదు. ఇటు ఇరుగుపొరుగు దేశాలతో ఘర్షణకు దిగుతూ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. దక్షిణ చైనా సముద్రంపై(South China Sea)ఆధిపత్యం కోసం చూస్తున్న చైనాకు క్వాడ్ (Quad)సమాఖ్యతో ముకుతాడు వేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఫలితంగా ఇరు దేశాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటున్నాయి. ఇప్పుడు మరోసారి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ విమర్శలు సంధించారు.
అగ్రరాజ్యం అమెరికా(America)ఆధిపత్యాన్ని సహించేదిలేదని చైనా పరోక్షంలో సూచిస్తోంది. ఐక్యరాజ్యసమితి(UNO)నిర్దేశించిన అంతర్జాతీయ చట్టానికి ప్రపంచ దేశాలన్నీ ఎలాంటి మినహాయింపులు లేకుండా కట్టుబడి ఉండాలని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తేల్చిచెప్పారు. అంతర్జాతీయ నిబంధనలను ఏవో కొన్ని దేశాలు నిర్దేశించలేవని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి అధికారాన్ని అందరూ ఆమోదించాలని, సమితి పట్ల నిబద్ధులై ఉండాలని హితవు పలికారు. చైనాను(China)ఒక దేశంగా ఐక్యరాజ్యసమితి గుర్తించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రత్యేక సదస్సులో జిన్‌పింగ్ మాట్లాడారు. అంతర్జాతీయ నిబంధనలను ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్యదేశాలు మాత్రమే కలిసికట్టుగా రూపొందిస్తాయని అన్నారు. ఈ విషయంలో మరో మాటకు తావు లేదని వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలు లేదా కొన్ని దేశాల కూటములు ..నిర్దేశించలేవన్నారు. సమితిని గౌరవించాలని ప్రపంచ దేశాలకు జిన్‌పింగ్ సూచించారు. సమితిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలకు దూరంగా ఉండాలని కోరారు.
Also read: China Vaccination: వ్యాక్సినేషన్‌లో చైనా కీలక నిర్ణయం, తొలిసారిగా మూడేళ్ల చిన్నారులకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook