Indian Economy:Indian Economy: 5 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థ. ఇది దేశ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం. ఎంతవరకూ నిజమవుతుందో తెలియదు గానీ..ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మాత్రం ఇండియా అవతరించనుంది. సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ నివేదిక ఏం చెబుతుందో చూద్దాం..
ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్ధిక వ్యవస్థల్ని అంచనా వేసే సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ తాజాగా వెలువరించిన నివేదిక ఆసక్తికరమైన అంశాల్ని ఉదహరించింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ 2022లో తొలిసారిగా 100 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనుందని తెలిపింది. 2030 నాటికి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలవనుందని..అమెరికా రెండవ స్థానానికి పరిమితం కానుందని తెలిపింది. 2021లో అంటే ఈ ఏడాదికి 194 దేశాల ఆర్ధిక వ్యవస్థల పరిమాణం 94 ట్రిలియన్ డాలర్లుగా ఉందని అంచనా వేసింది. వచ్చే ఏడాదికి ఇది వంద ట్రిలియన్ డాలర్లకు చేరుకోనుంది.
అదే సమయంలో రానున్న రెండేళ్లలో ఇండియా ఆర్ధిక వ్యవస్థ (Indian Economy System)..ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్ని దాటనుందని అంచనా వేస్తోంది. 2022లో ఇండియా ఆర్ధిక వ్యవస్థ..ఫ్రాన్స్ దేశాన్ని దాటి..ప్రపంచంలో ఆరవ స్థానంలో నిలవనుంది. 2023లో బ్రిటన్‌ను దాటి..ప్రపంచంలో మూడవ స్థానాన్ని ఆక్రమించనుంది. ప్రపంచంలో అత్యధిక వృద్ధిరేటుతో కొనసాగుతున్న దేశం ఇండియా. 2023లో జర్మనీ ఆర్ధిక వ్యవస్థ..జపాన్‌ను దాటుతుందని..2036లో రష్యా ప్రపంచంలో పదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలవనుందని సీఈబీఆర్ నివేదిక స్పష్టం చేసింది. ఇక 2034లో ఇండోనేషియా కూడా ప్రపంచంలో 9వ స్థానాన్ని ఆక్రమించనుందని పేర్కొంది. ప్రస్తుతం టాప్ 10 ఆర్ధిక వ్యవస్థలుగా వరుసగా అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇండియా, ఇటలీ, కెనడా, దక్షిణ కొరియా దేశాలున్నాయి.
ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు (World Economic System) అతి పెద్ద సమస్యగా మారనుందని సీఈబీఆర్ నివేదిక (CEBR) స్పష్టం చేసింది. అమెరికా, చైనా దేశాల్లో ద్రవ్యోల్బణం దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరిందని వివరించింది. ఫలితంగా పలుదేశాల్లో వడ్డీరేట్లు పెరుగుతాయని విశ్లేషించింది. ఆర్ధిక మాంద్యం తలెత్తకుండా ఆర్ధిక వ్యవస్థల్ని కాపాడుకోవడమనేది పెను సవాలుగా మారనుంది.
Also read: Sidhu controversy: ప్యాంట్లు తడిచిపోతాయంటూ.. పోలీసులపై సిద్ధూ వివదాస్పద వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook