ICJ ON Russia: రష్యాకు అంతర్జాతీయ న్యాయ స్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌పై చేపట్టిన ప్రత్యేక సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని ఐసీజే ఆదేశించింది. డాన్బాస్ ప్రాంతంలో ఊచకోత జరిగిందన్న సాకుతో రష్యా.. తమ దేశంపై దాడి చేస్తోందని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 1948 జెన్సైడ్ కన్వెన్షన్‌ను రష్యా ఉల్లంఘించందని తెలిపింది.
దాడిని ఆపాలని ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఈ విచారణకు రష్యా హాజరుకాలేదు. తర్వాత లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఈ అంశం న్యాయస్థానం పరిధిలోకి రాదని వాదించింది. న్యాయమూర్తి జోన్.ఈ.డోన్హ్యూ నేతృత్వంలోని ధర్మాసనం.. రష్యా సైనిక చర్యను తప్పుబట్టింది. వెంటనే యుద్ధం నిలిపివేయాలని తీర్పునిచ్చింది.
ఈ తీర్పును రష్యా అమలు చేయకపోతే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి అంతర్జాతీయ న్యాయస్థానం నివేదిస్తుంది. మండలిలో రష్యాకు వీటో పవర్ ఉంది. ఈక్రమంలో ఈ తీర్పు అమలు ప్రశ్నార్థకమేనని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. కోర్టు తీర్పుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ సంపూర్ణ విజయం సాధించిందన్నారు. అంతర్జాతీయ న్యాయ స్థానం తీర్పును రష్యాలు అమలు చేయాలని తెలిపారు.
మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. ఈ దాడిలో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. మేరియుపొల్‌లోని ఓ థియేటర్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఆ సమయంలో అక్కడ 12 వందల మంది వరకు పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో చాలా మంది వరకు చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో థియేటర్లో ధ్వంసమైంది. ఉద్దేశపూర్వకంగానే రష్యా సేనలు.. పౌరులపై మారణ హోమానికి పాల్పడ్డారని మేరియుపోల్ నగరపాలక సభ్యులు ఆరోపించారు. కీవ్ నగరంపై కూడా రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బాంబు దాడుల్లో మరో ఇద్దరు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Gold and Silver Rates Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర! నేటి పసిడి, వెండి రేట్లు ఇవే!!
Also Read: Harmanpreet Kaur: వావ్.. వాట్ ఏ క్యాచ్ హర్మన్‌ప్రీత్! బహుశా జాంటీ రోడ్స్ కూడా పట్టడేమో (వీడియో)!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook