Terror attack in Mali : పశ్చిమాఫ్రికా దేశం మాలిలో (Mali) ఉగ్రవాదులు నరమేదం సృష్టించారు. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో 31 మంది మృతి చెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మోప్తి పరిధిలోని బండియగరా పట్టణంలో ఉన్న ఓ స్థానిక మార్కెట్ సమీపంలో శుక్రవారం (డిసెంబర్ 5) ఈ ఘటన చోటు చేసుకుంది.
గుర్తు తెలియని వ్యక్తులు బస్సుపై కాల్పులు (Terror Attack in Mali) జరిపారని బండియగరాకు సమీపంలో ఉండే బంకాస్ పట్టణ మేయర్ మౌలయే గిండే వెల్లడించారు. ఆ బస్సు వారంలో రెండు సార్లు సొంగో అనే పట్టణం నుంచి బండియగారా పట్టణంలోని మార్కెట్‌కు వస్తుందన్నారు. కాల్పుల ఘటనలో 31 మంది మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బస్సు నిండా మృతదేహాలతో ఆ దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి. అల్‌ఖైదా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
ఇదే మాలిలోని మరో ప్రాంతంలో ఐక్యరాజ్య సమితికి (United Nations) చెందిన కాన్వాయ్‌పై శుక్రవారం (డిసెంబర్ 5) ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఆ కాన్వాయ్ కిదల్ నగరం నుంచి గావ్ అనే పట్టణానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
మాలిలో (Mali) 2012 నుంచి అస్థిరత నెలకొంది. అక్కడి దక్షిణ, ఉత్తరాది ప్రాంతాల మధ్య నెలకొన్న సంఘర్షణ అంతకంతకూ తీవ్రమవుతూనే ఉంది. ఏప్రిల్, 2012లో మాలి దేశాన్ని ఎంఎన్ఎల్ఏ (National Movement for the Liberation of Azawad-MNLA))తీవ్రవాద సంస్థ తమ ఆధీనంలోకి తీసుకుంది. మాలిలో షరియా చట్టాలను అమలుచేయడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది. మాలిలో మళ్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినప్పటికీ... ఉగ్రవాద సంస్థలు దేశంలో అస్థిరత ఏర్పరిచేందుకు నిత్యం దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. 2020లో మోప్తి పరిధిలోని పలు గ్రామాల్లో దాదాపు 400 మంది గ్రామస్తులను ఉగ్రవాదులు (Terrorists )పొట్టనపెట్టుకున్నారు.
Also Read: Omicron: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు..దేశంలో 4కి చేరిన కేసుల సంఖ్య..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook