Russia Ukraine War Updates: ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అమెరికా, నాటోకి మరోసారి విజ్ఞప్తి చేశారు. నో ఫ్లై జోన్ ప్రకటిస్తేనే రష్యా వైమానిక దాడులకు తెరపడుతుందన్నారు. రష్యా దాడుల నేపథ్యంలో గతంలో అమెరికాపై జరిగిన 9/11, పెరల్ హార్బర్‌పై జపాన్ జరిపిన దాడులను జెలెన్‌స్కీ ప్రస్తావించారు. బుధవారం (మార్చి 16) యూఎస్ కాంగ్రెస్‌తో వర్చువల్ సమావేశం సందర్భంగా జెలెన్‌స్కీ మాట్లాడారు.
ఇదే సమావేశంలో ఉక్రెయిన్‌పై రష్యా విధ్వంసానికి సంబంధించిన వీడియోలను జెలెన్‌స్కీ చూపించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఒక విజ్ఞప్తి చేశారు. 'మీరు ప్రపంచ దేశాలకు నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రపంచానికి నాయకత్వ స్థానంలో ఉండటమంటే.. శాంతి కాముకుడిగా ఉండటమే.' అని పేర్కొన్నారు. తద్వారా రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పాలని పరోక్ష విజ్ఞప్తి చేశారు. జెలెన్‌స్కీ ప్రసంగానికి యూఎస్ కాంగ్రెస్ సభ్యులు నిలబడి చప్పట్లు కొట్టారు.
కాగా, రష్యాతో యుద్దానికి ఉక్రెయిన్‌కు సహాయ సహకారాలు అందిస్తున్న అమెరికా, యూరోప్ దేశాలు.. ఆ దేశం తరుపున ప్రత్యక్ష యుద్ధంలో దిగేందుకు మాత్రం సుముఖంగా లేవు. ఒకవేళ అలా యుద్దానికి దిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందోమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఒకవేళ నో ఫ్లై జోన్ ప్రకటించినా.. రష్యా యుద్ధ విమానాలను అమెరికా, నాటో దళాలు ప్రత్యక్షంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని.. అదే జరిగితే యుద్ధం ఉక్రెయిన్‌ని దాటి మరింత విధ్వంసానికి దారితీస్తుందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జెలెన్‌స్కీ మాత్రం నో ఫ్లై జోన్ కోసం పదేపదే అమెరికా, నాటోకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. యుద్దం మూడో వారానికి చేరడంతో ఉక్రెయిన్ ఉనికిపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Jhulan Goswami ODI Wickets: చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా క్రికెటర్ జులన్ గోస్వామి!
Also Read: IND vs ENG: వరల్డ్ కప్ లో టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ.. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో ఓటమి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook