Afghanistan: అఫ్ఘనిస్థాన్‌లో వరుసగా పేలుళ్లు సంభవిస్తున్నాయి. తాజాగా కాబుల్‌లో మరో పేలుడు చోటుచేసుకుంది. పాఠశాలలోని క్లాస్ రూమ్ టార్గెట్‌గా దాడి జరిగింది. ఇందులో 53 మంది దుర్మరణం చెందారు. భారీ స్థాయిలో విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో 46 మంది మహిలు, బాలికలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇటీవల కాబుల్‌లోని విద్యా కేంద్రంలో ఇలాంటి ఘటనే జరిగింది.
ఇందులో వందకు పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయాయి. ఈఘటన మరవకముందే మరొకటి చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. తరగతిలో మృతదేహాలను చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. తరగతి గది సైతం ధ్వంసమైంది. దీంతో పాఠశాలను ఖాళీ చేయించారు. కొన్నిరోజుల వరకు మూసివేస్తున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు ..ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also read:IND vs SA: టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేస్తుందా..? రేపే చివరి మ్యాచ్..!
Also read:5G Services: భారతదేశంలో 5జీ యుగం..గుడ్‌న్యూస్ చెప్పిన జియో సంస్థ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook