Russia Completes First Trial: కోవిడ్-19 ( Covid-19 ) వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కోటి కన్నా ఎక్కువ మందికి సోకింది. అనేక దేశాలు దీనికి విరుగుడు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాయి. తాజాగా రష్యా ఈ విషయంలో ( Russian Coronavirus Vaccine ) తము ముందంజలో ఉన్నట్టు తెలిపింది. వ్యాక్సిన్‌కు సంబంధించి మనుషులపై తొలి క్లినికల్ ట్రయల్ పూర్తి చేసినట్టు ఆ దేశానికి చెందిన సెచెనోవ్ యూనివర్సిటీ ( Sechonov University ) తెలిపింది. అయితే నిపుణులు వీటిపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. Also read: Kawasaki Syndrome: కొవిడ్-19 పోనే లేదు భారత్‌లో మరో వ్యాధి కలకలం
ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ డైరక్టర్ వాదిమ్ తరాసోవ్ ( Vadim Tarasov ) స్థానిక వార్తా ఏజెన్సీ స్పూత్నిక్ న్యూస్ (Sputnik News ) కు ఈ విషయం గురించి తెలిపారు. సచెనోవ్ విశ్వవిద్యాలయం మనుషులపై కరోనావైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ( Vaccine Clinical Trials) ప్రయోగాలు పూర్తి చేసింది అని ఆయన తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) దీనిపై స్పందించింది. రష్యా ప్రయోగించిన వ్యాక్సీన్ తొలి దశను ( Russia Completes First Trial ) మాత్రమే పూర్తి చేసింది అని స్పష్టం చేసింది. అంటే రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ఇంకా 3-4 ట్రయల్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే రష్యా ప్రకటన చేసిన వెంటనే నిపుణులు ఆశ్చర్యపోయారు. రష్యా అంత త్వరగా టీకాను ఎలా సిద్ధం చేయగలిగింది అని సందేహం వ్యక్తం చేశారు.
దాంతో పాటు ప్రస్తుతం ప్రయోగాల్లో ముందంజలో ఉన్న 21 టీకాల జాబితాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organization ) సిద్ధం చేసింది. ఈ టీకాలు అన్నింటిలో కేవలం 2 టీకాలు మాత్రమే మానవ ప్రయోగ దశ ( Human Trials ) కు చేరుకున్నాయి. ఇందులో చైనాకు చెందిన సినోవాక్ ( Sinovac ), ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం-ఆష్ట్రాజెనెకా ( AstraZeneca ) తయారు చేసిన వైరల్ వెక్టార్ వ్యాక్సీన్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో రష్యాకు చెందిన వ్యాక్సిన్ పేరు లేదు.Also Read : CoronaVirus మళ్లీ మళ్లీ సోకవచ్చు.. రీసెర్చ్‌లో షాకింగ్ విషయాలు
రష్యా ఏం చెబుతోంది ?
ఇక రష్యా వ్యాక్సిన్ గురించి చేసిన ప్రకటనలో మనుషులపై అన్ని ప్రయోగాలు పూర్తి అయ్యాయి అని తెలిపింది. అయితే ఈ ప్రయోగంలో కేవలం 40 మంది వాలంటీర్లను మాత్రమే వినియోగించారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రెండో దశల ప్రయోగంలో తక్కువలో తక్కువగా 100 మంది ఉండాలి అని తెలిపింది.
వ్యాక్సిన్‌పై మూడో దశ ప్రయోగం కోసం తక్కువలో తక్కువగా 1000 మంది ఉండాలని తెలిపింది. అంటే రష్యా ఇప్పటి వరకు కేవలం తొలి దశను మాత్రమే పూర్తి చేసిందని స్పష్టం అవుతోంది.
కరోనావైరస్ వ్యాక్సిన్‌పై రష్యా ట్రయల్స్ జూన్ 18 ప్రారంభం అయ్యాయి. 30 రోజులు పూర్తి అవ్వక ముందే అన్ని ట్రయల్స్ పూర్తి చేయడం సాధ్యం అయ్యే కాదు. ఇబోలా (Ebola ) , మలేరియా ( Malaria ), డేంగ్యూలకు ( Dengue ) వ్యాక్సిన్ సిద్ధం చేయడానికి నాలుగు సంవత్సరాల కనీసం సమయం పట్టింది. ఇలాంటి సమయంలో నెలలోనే వ్యాక్సిన్ కనుగొన్నాం అని రష్యా ప్రకటించడం తొందరపాటు అని నిపుణులు చెబుతున్నారు.
Also read:Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ
Also Read : CoronaVirus మళ్లీ మళ్లీ సోకవచ్చు.. రీసెర్చ్‌లో షాకింగ్ విషయాలు