Andhra Pradesh: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం: ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) సంభవించింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న క్రమంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట (jaggayyapeta)మండలంలోని గరికపాడు ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.

Last Updated : Dec 10, 2020, 08:43 AM IST
Andhra Pradesh: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం: ముగ్గురు మృతి

AP Road Accident - 3 persons killed: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) సంభవించింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న క్రమంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట (jaggayyapeta)మండలంలోని గరికపాడు ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం ( 3 persons killed ) చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక వృద్దుడు ఉన్నారు. 

వీరంతా తెలంగాణ ( Telangana ) లోని ఖమ్మం జిల్లా, మధిర మండలం, ఆత్కూరు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో కారులో 9మంది ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also read: Health Benefits of Egg: ప్రతిరోజూ ‘గుడ్డు’ ఎందుకు తినాలో తెలుసా?

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..
మధిర, ఆత్కూరు గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు వేములవాడ దైవ దర్శనానికి వెళ్లారు. అనంతరం తిరిగివస్తున్న క్రమంలో కారు ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన మాచర్ల శ్యామ్‌ (60), శారద (55), శ్యామల (38) అక్కడిక్కడే మృతిచెందారు. దీంతో ఆత్కూరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మరికొంత సమయంలోనే ఇంటికి చేరుతారనగా ఈ ప్రమాదం సంభవించడంపై పలువురు విచారం వ్యక్తంచేస్తున్నారు. 

Also read: COVID-19 vaccine: ఆ వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి బ్రేక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News