BirdFlu Effect: బర్డ్ ఫ్లూ కలకలం.. మూడు నెలల పాటు చికెన్ షాపులు తెరవకూడదంటూ ఆదేశాలు.. వివరాలివే...

Andhr pradesh: కొన్ని నెలలుగా బర్డ్ ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అనేక కోళ్లు చనిపోతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా నెల్లూరులోని పొదలకూరు, కోవూరు మండలాల్లో కోళ్లు ఎక్కువగా మృత్యువాత పడినట్లు అధికారులు గుర్తించారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 16, 2024, 10:32 AM IST
  • - నెల్లూరు లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి..
    - చికెన్ షాపులో మూసేయాలని ఆదేశాలు..
BirdFlu Effect: బర్డ్ ఫ్లూ కలకలం.. మూడు నెలల పాటు చికెన్ షాపులు తెరవకూడదంటూ ఆదేశాలు.. వివరాలివే...

Chickent Shops Close Upto 3 Months Due To Bird Flu: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో వందల కోళ్లు మృత్యువాత పడ్డాయి. గత కొన్నినెలలుగా అనేక కోళ్లు బర్డ్ ఫ్లూకు గురికావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం  చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ లోని నెల్లూరులో కోళ్లు కు బర్డ్ ఫ్లూ సోకడం తీవ్ర కలకలంగా మారింది. వెంటనే అధికారులు అప్రతమత్తమయ్యారు. పొదలకూరు, కోవూరు మండలాల్లో దీని వ్యాప్తి మరింత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Read More: Smelly Shoes: మీ బూట్ల నుంచి భరించలేని దుర్వాసన వస్తుందా..?.. ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టేయోచ్చు..

వెంటనే దీనిపై జిల్లా అధికారి ఎం హరినారాయణన్  కఠినమైన చర్యలకు ఆదేశించారు. వెంటనే ఈ గ్రామాల పరిధిలోని10  కిలోమీటర్ల వరకు 3 రోజుల పాటు చికెన్ షాపులు మూసి వేయాలని ఆదేశించారు. అదే విధంగా 1 కిలో మీటర్ పరిధిలోని షాపులను మూడు నెలల వరకు తీయకూడదని కూడా ఆదేశాలు జారీచేశారు.

అదే విధంగా బర్డ్ ఫ్లూ సోకి చనిపోయిన కోళ్లను గ్రామ శివారులో భూమిలో పాతిపెట్టాలని అన్నారు. అదే విధంగా ఇలాంటి ఫామ్స్, చికెన్ షాపులలో పనిచేసే వారు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు జారీచేశారు.  ఇదిలా ఉండగా ఇప్పటికే చాలా మంది ప్రజలు కోడిగుడ్లను, చికెన్ ను పూర్తిగా తినడం మానేసినట్లు తెలుస్తోంది.

Read More: Aadi Keshava: వెండితెరపై డిజాస్టర్ల పరంపర..బుల్లితెరపై మాత్రం బ్లాక్ బస్టర్ సాధించిన మెగా కాంపౌండ్ హీరో!

ఈ విషయం వెలుగులోకి రావడంతో అనేక చోట్ల చికెన్ ల ధరలు కూడా భారీగా పడపోయినట్లు సమాచారం.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు కూడా ఎప్పటికప్పుడు గ్రామంలో తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News