Padma Award For Gaddar: 'పద్మ అవార్డులకు జాబితా పంపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎంతో మందిని నక్సల్స్‌తో చంపించిన గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తాం' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు. ప్రజాస్వామ్య బద్దంగా పోరాడిన వందల మంది బీజేపీ కార్యకర్తలను చంపించిన వ్యక్తి గద్దర్ అని విమర్శలు చేశారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది.
Also Read: Govt Employees: పీఆర్సీ పత్తా లేదు.. రిటైర్మెంట్ డబ్బుల్లేవ్.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ పద్మ అవార్డులపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డు గద్దర్‌కు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. ఆయనో హంతకుడిగా చిత్రీకరించారు. తెలంగాణ భావోద్వేగాన్ని మళ్లీ రెచ్చగొట్టి లాభపడాలనుకుంటున్నారని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలన్నీ అర్ధమవుతున్నాయని పేర్కొన్నారు.
Also Read: Republic Day: గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి.. హుస్సేన్‌సాగర్‌లో మంటలు
'పద్మ అవార్డులకు ప్రతిపాదనల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఆలోచించి పంపాలి. నక్సల్స్ భావజాలమున్న గద్దర్ వందలాది మంది బీజేపీ కార్యకర్తల చావులకు కారణమయ్యారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలి. తెలంగాణ భావోద్వేగాన్ని మరోసారి రగిలించి లబ్ది పొందాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చూస్తున్నాయి' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కేంద్ర పథకాలకు పేర్లు మార్చే అంశంపై మరోసారి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు మార్చితే మాత్రం వాటిని రాష్ట్ర ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుందని బండి సంజయ్ ప్రకటించారు. పరిస్థితి అంతవరకు తీసుకురావొద్దని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితిల్లోనూ అన్యాయం చేయబోమని ఉద్ఘాటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.