Land titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి ? ఈ యాక్ట్ ప్రజలకు నిజంగా ఉపయోగమేనా .. ? Part -1

Land titling Act: ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ప్రజల పాలిట యమపాశం అంటూ ప్రతిపక్షాలు ఏపీలోని వైసీపీ సర్కారుపై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజలకు మేలు చేసేదే అంటూ చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏమిటి ? ఇది ప్రజలకు ప్రయోజనమా.. ? లేదా అనేది చూద్దాం..  

Written by - TA Kiran Kumar | Last Updated : May 7, 2024, 12:54 PM IST
Land titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి ? ఈ యాక్ట్ ప్రజలకు నిజంగా ఉపయోగమేనా .. ? Part -1

What is Land Titling Act: ఏపీలో అసెంబ్లీ,పార్లమెంట్‌కు కలిపి జమిలి ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికల్లో ఇపుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది.  ప్రతిపక్షాలు మాత్రం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రజల భూములను ప్రభుత్వం లేదా ఇతరులు లాక్కొనే అంశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు గుప్పిస్తోంది. మరోవైపు ఈ యాక్ట్ వల్ల ప్రజలకు మేలు చేసేదే కానీ కీడు చేసేది ఎంత మాత్రం లేదని అధికార వైయస్‌ఆర్సీపీ వాదిస్తోంది. ఇందులో నిజా నిజాల విషయానికొస్తే..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రానున్న రోజుల్లో అతిపెద్ద భూసంస్కరణగా నిలవబోతుందో ఏపీ ముఖ్యమంత్రి తను పాల్గొంటున్న ప్రతి ప్రచార సభలో చెబుతూ వస్తున్నాడు. ఈ యాక్ట్ వల్ల భూములపై వ్యవసాయదారులకు రైతులకు సంపూర్ణ హక్కు ఎల్లపుడు ఉండేలన్న లక్ష్యంతో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉపయోగపడుతుందని చెప్పుకొస్తున్నారు. ప్రతిపక్షాలు కావాలని ఈ టైటిల్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నాయని జగన్ వాదిస్తున్నారు.

మన దగ్గర భూ వివాదాలు కోర్టుల్లో ఎన్నో ఏళ్లుగా నలుగుతూ వస్తున్నాయి. భూ వివాదాల్లో ఓడిపోయిన వారు కోర్టుల్లో ఏడిస్తే.. కేసు గెలిచిన వారు కోర్టు బయట ఏడుస్తారనేది చాలా మంది చెప్పుకునే మాట. భూ వివాదాల్లో ఏళ్ల తరబడి కోర్టుల్లో సాగే విచారణ.. అందుకు అయ్యే ఖర్చు.. చివరకు న్యాయమూర్తి చెప్పే జడ్జిమెంట్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకోని ఇది చెప్పుకొచ్చారు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా.. భూములపై వస్తున్న వివాదాలను పరిష్కరించి .. భూమిపై శాశ్వత హక్కు కల్పించడం.. వివాదంలో ఉన్న భూములపై ప్రభుత్వమే బాధ్యత తీసుకోవడం.. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉద్దేశ్యం. దీంతో ఏదైనా ఎవరైనా భూ వివాదాల్లో మోసపోతే.. ప్రభుత్వమే వారికి పరిహారం చెల్లించేలా ఈ యాక్ట్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఉంది.

బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్‌కు ఆడారి కిషోర్ సవాల్..

ప్రతిపక్షాలు తన నోటికి ఇష్టమొచ్చినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తోన్న నేతలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోరు విప్పి సమాధానం చెప్పాలని వైయస్సాఆర్సీపీ అనకాపల్లి లోక్‌సభ ఇంచార్జ్ ఆడారి కిషోర్ కుమార్ బహిరంగా సవాల్ విసిరారు. ఈ సోమారవం మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అద్భుతంగా ఉందన్నారు. తమ పార్టీ ఈ యాక్ట్‌కు మద్దతు ఇస్తోందన్నారు. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అసెంబ్లీ లోనే ఈ చట్టం గొప్పదని అప్పట్లోనే చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.  ఈ చట్టం పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ లపై సిఐడి కి ఫిర్యాదు చేశామన్నారు. మిగతా వాళ్ళు విచారణలో తేలుస్తారన్నారు.

 CM Jagan

కేవలం డబ్బు ఉందనే అహంకారం తప్ప మరో అర్హత లేని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మరో అర్హతలు లేవన్నారు. దమ్ముంటే తనతో డిబేట్ కు రావాలని ఆడారి కిషోర్ కుమార్ సవాల్ విసిరారు. కడప నుంచి కోట్లాది రూపాయలతో వలస వచ్చి, అనకాపల్లి ని ఉద్ధరిస్తానని భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్‌గా వచ్చారన్నారు. ఆయనకు కనీసం అనకాపల్లి సరిహద్తులు కూడా తెలియదన్నారు. గత పదేళ్లుగా రాజ్యసభగా సభ్యునిగా ఆంధ్ర ప్రదేశ్‌కు ఆయన చేసింది శూన్యమన్నారు.  తనకు ఏపీ లోని సమస్యలు పూర్తిగా అవగాహనా ఉందన్నారు.  సీఎం రమేష్ కు దమ్ముంటే తనతో ఓపెన్ డిబేట్ కు రావాలని సవాల్ విసిరారు.

అనకాపల్లిలో కడప, తెలంగాణ కు చెందిన వందలాది మందిని వాహనాల్లో తరలించి ఇక్కడ ప్రచారం  కోసం వాడుతున్నారన్నారు. అతని చిత్తశుద్ధి ఇక్కడే తెలిసిందన్నారు. స్థానిక వాహనాలను వాడితే స్థాయి స్థానిక యువతకు కొంత ఉపాధి లభిస్తుంది కదా. కనీసం ఈ మాత్రం సాయం కూడా స్థానికులకు చెయ్యడం ఇష్టపడని  వ్యక్తి  ఎంపీ అయితే ఇక్కడ ప్రజలను ఏమి ఉద్ధరిస్తాడని మండిపడ్డారు.

ఇక అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ గతంలో మంత్రిగా ఉండి..  ఏమి ఉద్దరించారో తమకు పూర్తిగా అవగాహాన ఉందన్నారు. ఆయన గురించి మాట్లాడటం అంటే మన సమయాన్ని వృథా చేసుకోవడమే అన్నారు. ఈ సమావేశంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులూ తదితరులు పాల్గొన్నారు.

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News