Heavy Rains Alert in AP: ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భగభగమండుతున్న ఎండలతో నెలరోజుల్నించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజానీకం ఊరట చెందారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, పిడుగులు విధ్వంసం రేపాయి. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మహారాష్ట్రలోని తూర్పు విదర్బ ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు, తెలంగాణ, దక్షిణ కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నిన్న ఒక్కసారిగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.
ఏపీలో భారీ వర్షాలు
నెల్లూరు, పల్నాడు, శ్రీకాకుళం, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇక విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, ప్రకాశం, విజయనగరం, జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక రేపు అంటే మే 9వ తేదీ గురువారం విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, కర్నూలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇతర ప్రాంతాల్లో చిరుజల్లులు లేదా తేలికపాటి వర్షాలు పడనున్నాయి.
ఏపీలో నిన్న మంగళవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. వేమగిరిలో 12.4 సెంటీమీటర్లు, రాజమండ్రిలో 9.2 సెంటీమీటర్లు, మండపేటలో 12 సెంటీమీటర్లు, కోనసీమ జిల్లా తాటిపూడిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఏలూరు జిల్లా నూజివీడులో 7.3 సెంటీమీటర్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 7 సెంటీమీటర్లు, ఆలమూరులో 7 సెంటీమీటర్లు వర్షం కురిసింది.
ఏపీలోని కోస్తాంధ్రలో వాతావరణం ఇలా ఉంటే రాయలసీమలో మాత్రం తీవ్రస్థాయిలో ఎండలు కొనసాగాయి. కర్నూలులో అత్యధికంగా 43.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లోలో 43 డిగ్రీలు, కడప, తిరుపతి జిల్లాల్లో 42 డిగ్రీలు నమోదైంది. ఇవాళ, రేపు కూడా కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమలో ఎండలు కొనసాగనున్నాయని అంచనా.
Also read: Heavy Rains: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook