Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనమైనా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం ఉత్తర మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఫలితంగా రానున్న 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఏయే జిల్లాలకు వర్షసూచన ఉందో తెలుసుకుందాం.
బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాంతో రానున్న 48 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని ఐఎండీ వివరించింది. దాంతో వచ్చే రెండ్రోజులు ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు సంభవించనున్నాయి. గాలుల వేగం గంటకు 30-40 కిలోమీటర్లు ఉండవచ్చు. ఇక రేపు ఎల్లుండి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రేపు కూడా ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు.
ఇక దక్షిణ కోస్తాంధ్రలోని కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో రానున్న 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. తీరం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదులు గాలులు వీయనున్నాయి. రేపు, ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు ఈదులు గాలులు వీయవచ్చు.
ఇక రాయలసీమలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీయనున్నాయి. ఎల్లుండి కూడా రాయలసీమలో వాతావరణం ఇలాగే ఉండవచ్చు. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, హిందూపురం, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు.
Also read: OTT Movies: దసరా సెలవుల్లో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.