Intermediate Exams 2023: దేశవ్యాప్తంగా పరీక్షల సీజన్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇటు ఏపీ, అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ మార్చ్ 15 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం, మార్చ్ 16 నుంచి ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.
ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ఒకే సమయంలో ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 15 అంటే ఇవాళ్టి నుంచి, పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి జరుగుతాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకూ జరగనున్నాయి. ఇప్పటికే సంబంధిత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి 1489 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 10,03,390 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం 4,84,197 మంది, ద్వితీయ సంవత్సరానికి 5,19,793 మంది హాజరుకానున్నారు.
ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సీసీటీవీ కెమేరా నిఘా ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏవిధమైన సెల్ ఫోన్లు, డిజిటల్ వాచ్, బ్లూటూత్, ట్యాబ్‌లు, డిజిటల్ పరికరాలకు అనుమతి లేదు. నిర్ణీత సమయం దాటిన తరువాత అనుమతి ఉండదని ఇంటర్మీడియట్ బోర్డ్ స్పష్టం చేసింది. ప్రతి 20-25 కేంద్రాలకు ఒక 108 ఆంబులెన్స్ సిద్ధంగా ఉంచారు.
ఇక తెలంగాణలో కూడా ఇంటర్ పరీక్షలు ఇవాళ్టి నుంచే ప్రారంభమయ్యాయి. మొత్తం 1473 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో మొత్తంత 9,47,699 మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 9 గంటల తరువాత వచ్చినవారికి అనుమతి ఉండదు. పరీక్షల కోసం 75 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 26,333 మంది ఇన్విజిలేటర్లు, 1473 మంది ఛీఫ్ సూపరింటెండెంట్లు, 1473 డిపార్ట్ మెంట్ ఆఫీసర్లను నియమించారు.
Also read: Pawan Kalyan Speech: రాష్ట్రంలో ఒక్క కులం పెత్తనం పోవాలి.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook