AP Assembly Election 2023 Dates News: ఏపీలో ముందస్తు ఎన్నికల సందడి కనిపిస్తోంది. జూన్ 7న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. అందుకే ఈ కేబినెట్ భేటీని ఏర్పాటు చేసి ఉంటారేమోనని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్ నెలలో అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణ ఎన్నికలతో పాటే ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా డిసెంబర్ నెలలో ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఈ విషయం పసిగట్టిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముందుగానే అలర్ట్ అయి మహానాడులో మినీ మ్యానిఫెస్టో కూడా ప్రకటించారు అని ఏపీలో పబ్లిక్ టాక్ నడుస్తోంది. అంతేకాదు.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అలర్ట్ అవుతూ ఈ నెల 14 నుంచి వారాహి వాహనంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే వారాహి యాత్రపై జనసేన పార్టీ అగ్ర నేత నాదెండ్ల మనోహర్ పార్టీకి చెందిన కీలక నేతలతో చర్చలు ప్రారంభించారు. వారాహి యాత్ర రూట్ మ్యాప్, ఇతర అంశాలపై నేతలతో ఇప్పటికే పలుమార్లు చర్చించిన నాదెండ్ల మనోహర్.. శుక్రవారం మంగళగిరిలో గోదావరి జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. వారాహి యాత్ర గోదావరి జిల్లాల నుంచే ప్రారంభం అవుతుందన్న సంకేతాల నేపథ్యంలో ఇవాళ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన పార్టీ నేతలతో నాదెండ్ల మనోహర్ నిర్వహించిన సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
ఇది కూడా చదవండి : APPSC Group-1 Mains Exams: రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. తొలిసారి ఆ విధానం అమలు
వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు వారాహి యాత్ర ప్రారంభించినా.. అది ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ముందుగా ప్రారంభిస్తారనే ముందు నుంచి ఒక ప్రచారం సాగింది. టీడీపీ యువనేత నారా లోకేష్ ఇప్పటికే రాయలసీమ నుంచి యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా ఉత్తరాంధ్ర నుంచి వారాహి యాత్ర ప్రారంభించేందుకు పవన్ ప్లాన్ చేశారు అని టాక్ వినపడింది. కానీ ఉత్తరాంధ్రతో పోలిస్తే గోదావరి జిల్లాల్లో జనసేనానికి ఎక్కువ స్పందన ఉండటం, ఇటీవల అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయిన క్రమంలోనూ పవన్ కళ్యాణ్ అక్కడి ప్రాంత రైతులను పరామర్శించి, చివరి గింజ కొనే వరకు ఉద్యమిస్తాం అంటూ అక్కడి రైతుల తరపున ప్రభుత్వాన్ని నిలదీసి ఉండటం వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని.. అక్కడి నుంచే వారాహి యాత్రను ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. లేదంటే .. ఒకవేళ ఉత్తరాంధ్ర నుంచే వారాహి యాత్రను ప్రారంభించి గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మరో ప్రచారం సాగుతోంది. ఇవన్నీ అంశాలను బేరీజు వేసుకుని పార్టీ అంతిమ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : Eggs Pelted at Nara Lokesh: నారా లోకేష్‌పై గుడ్లతో దాడి
ఇది కూడా చదవండి : Kodela Sivaram Slams Chandrababu: చంద్రబాబుపై కోడెల శివప్రసాద్ కుమారుడి సంచలన ఆరోపణలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK