AP Election Results 2024: రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. సీఎం జగన్‌తో టచ్‌లోకి కూటమి నేతలు

Who Will Win AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల ఫలితాల రావడానికి సమయం దగ్గర పడుతోంది. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ మరోవైపు గట్టి పట్టుదలతో ఉన్నాయి. అయితే ఫలితాలు ఎలా ఉండబోతాయోనన్న అన్ని పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. సీట్లు తక్కువ వస్తే ఏం చేయాలి..? ఎవరెవరిని తమ వైపు తిప్పుకోవాలని లాంటి వ్యూహ రచనలు మొదలు పెట్టాయి. ఏపీలో టీడీపీతో బీజేపీ జత కట్టడంతో.. ఇండియా కూటమి చూపు జగన్‌పై పడినట్లు తెలుస్తోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : May 31, 2024, 02:48 PM IST
AP Election Results 2024: రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. సీఎం జగన్‌తో టచ్‌లోకి కూటమి నేతలు

Who Will Win AP Elections 2024: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్‌ జూన్ 4న వెలువడనున్నాయి. నేతల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యాయి. ఎన్నికల్లో గెలిచేది ఎవరు..? ఓడేది ఎవరు..? అని ప్రజలు ఆస్తకిగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా..? కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందా..? అని ఇంట్రెస్టింగ్‌గా మారింది. గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు కావడంతో గెలుపు అంచనా వేయడం కష్టంగా మారిందని నిపుణులు అంటున్నారు. 

Also Read: Namo - Varanasi: వారణాసిలో వార్ వన్ సైడేనా..? మోదీ మెజారిటీతో గత రికార్డులు గల్లంతేనా.. ? 

అటు గెలుపుపై ప్రధాన పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి అధికారంలోకి వస్తుందని.. ఆ పార్టీకి అత్యధిక ఎంపీ సీట్లు దక్కుతాయంటూ కొన్ని సర్వేలు.. కాదు కూటమిదే హవా అంటూ మరికొన్ని సర్వేలు వెలువడుతుండటంతో ఎవరి అంచనాలు నిజమవుతాయని.. ఎవరి లెక్కలు తప్పుతాయని రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకుంటున్నారు. ఈ సారి బీజేపీ, టీడీపీ, జనసేనతో జతకట్టడంతో కేంద్రంలోని ఇండియా కూటమి నేతలు జగన్ వైపు మొగ్గుతున్నట్లు చెబుతున్నారు.

ఈ సారి వైసీపీ ఎంపీ స్థానాలు ఎక్కువగా గెలుచుకుంటే.. కచ్చితంగా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా జగన్ కీలకం అవుతారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మి నుంచి వైసీపీకి రాయ‌బారాలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినా.. ఎన్డీయే కూటమిలో టీడీపీ ఉండడంతో బీజేపీకి మద్దతు ఇచ్చే ఛాన్స్ లేదంటున్నారు. దీంతో ఇండియా కూటమి నేతలు జగన్ మద్దతు పొందేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ ఏపీలో టీడీపీతో కలవడంతో తమతో కలిసి రావాలని ఇండియా కూటమి నేతలు జగన్‌పై ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద ముందు ముందు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనది ఆసక్తికరంగా మారింది.

400 సీట్ల గెలుపు లక్ష్యంతో బరిలోకి దిగుతున్న బీజేపీకి దక్షిణాదిలో ఎంపీ సీట్లు కీలకం కాబోతున్నాయి. అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న యూపీతో పాటు బీహార్‌లో ఈసారి కమలం పార్టీకి సీట్లు తగ్గితే ఏంటి పరిస్థితి అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో గత ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు దక్కాయి. కానీ ఈసారి అక్కడ సీట్లు తగ్గే అవకాశం లేకపోలేదన్న వాదనలు ఉన్నాయి. అలాంటి తరుణంలో బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు కీలకం అవుతాయి. కూటమిగా ఏపీలో బరిలో దిగడంతో బీజేపీకి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందుకే ఏపీపై ఇండియా కూటమి ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. జూన్ 4న జడ్జిమెంట్‌ డేన అధికారం ఎవరిదో తేలిపోనుంది. 

Also Read: Kavya Maran Love Story: ఎస్ఆర్‌హెచ్‌ యంగ్ ప్లేయర్‌తో కావ్య మారన్ డేటింగ్.. ఆ క్రికెటర్ ఎవరంటే..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News