ఏపీలో 5 లక్షల ఇళ్ళ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

  

Last Updated : Nov 16, 2017, 07:05 PM IST
 ఏపీలో 5 లక్షల ఇళ్ళ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

ఆంధప్రదేశ్‌లో ప్రభుత్వం దాదాపు 5 లక్షల 39 వేల ఇళ్ళు కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాష్ట్ర మంత్రి నారాయణ తెలియజేశారు. విశాఖపట్నంలోని పరవాడ ప్రాంతంలో పర్యటించిన ఆయన  ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన తర్వాత ఆ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షలు మంజూరు అయితే.. అందులో దాదాపు 5 లక్షలు ఏపీలోనే నిర్మిస్తున్నామని.. ఆ విధంగా రాష్ట్రంలో బడుగువర్గాలకు సొంత ఇంటి కలను నెరవేర్చడానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. ప్రభుత్వమే దగ్గరుండి ఈ ఇళ్ళ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుందని.. అలాగే జియో ట్యాగింగ్ ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్ల అక్రమాలకు కూడా తెర దించుతుందని ఆయనతెలిపారు. ఇప్పటికే పనులను వేగవంతం చేయాలని అధికారులకు చెప్పామని. మార్చి 2019 నాటికి చెప్పిన విధంగా ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలియజేశారు. 

Trending News