Dist Name Change: ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి దిగొచ్చింది. స్థానికుల ఆందోళనతో ఒక జిల్లా పేరును మార్చింది. ఏపీలో గతంలో 13 జిల్లాలు ఉండగా.. వాటిని 26 జిల్లాలుగా విభజించింది జగన్ ప్రభుత్వం. పార్లమెంట్ పరిధిని ఒక జిల్లాగా ఏర్పాటు చేసింది. విస్తీర్ణం ఎక్కువగా ఉన్న అరకు లోక్ సభ పరిధిలో మాత్రం రెండు జిల్లాలను ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లాల పాలన అమలులోనికి వచ్చింది.
జిల్లాలను విభజించిన జగన్ ప్రభుత్వం.. కొన్ని జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టింది. అల్లూరి, ఎన్టీఆర్ పేర్లు పెట్టారు. గతంలోనే కడప జిల్లాకు వైఎస్సార్ పేరు ఉంది. దేవుళ్ల పేర్లను కొన్ని జిల్లాలకు పెట్టింది. అయితే జిల్లాల పేర్లకు సంబంధించి కొన్ని వివాదాలు వచ్చాయి. అల్లూరి, ఎన్టీఆర్ లానే అమలాపురం కేంద్రం ఏర్పడిన కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ వచ్చింది. ఇందుకోసం దళిత సంఘాలు, పలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. అయినా జగన్ ప్రభుత్వం మాత్రం కోనసీమ జిల్లానే కొనసాగించింది.ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్న కోనసీమ దళితులు.. నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అంబేద్కర్ పేరు పెట్టేవరకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రకటించారు. దీంతో దిగొచ్చిన జగన్ సర్కార్.. కోనసీమ జిల్లా పేరును మార్చేందుకు నిర్ణయించింది. కోనసీమ జిల్లా పేరును డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది.
తమకు అధికారం ఇస్తే లోక్ సభ పరిధిని జిల్లాగా చేస్తానని వైఎస్ జగన్ గత ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. 13 కొత్త జిల్లాలతో పాటు కొత్తగా 22 రెవిన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి. ఏపీలో ప్రస్తుతం మొత్తం 73 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కోనసీమ జిల్లా పేరును మార్చడంతో మరికొన్ని జిల్లాల పేర్లు మార్చాలనే డిమాండ్లు రావొచ్చనే ప్రచారం సాగుతోంది.
READ ALSO: Rajyasabha Kcr: జగన్ బాటలో కేసీఆర్.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్!
READ ALSO: Chandrababu Kadapa Tour: జగన్ ఇలాకాలో గర్జించిన చంద్రబాబు.. నియంతను తరిమికొడతామని వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook