కడప వెబ్ సిరీస్: వర్మకు 'రెడ్డి' మినిష్టర్ వార్నింగ్

తాను సినిమాల్లో చెప్పాలనుకుని, చెప్పలేకపోయిన విషయాలని చెప్పేందుకే డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టి 'కడప' పేరిట ఈ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నానన్న వర్మపై ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Last Updated : Dec 28, 2017, 07:50 PM IST
కడప వెబ్ సిరీస్: వర్మకు 'రెడ్డి' మినిష్టర్ వార్నింగ్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ 'కడప' పేరిట వెబ్ సిరీస్‌ను రూపొందిస్తుండటంపై మంత్రి ఆదినారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి.. గతంలో 'బెజవాడ' పేరిట ఓ సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ ఆ సినిమా స్క్రిప్టులో ఎలా మార్పులు చేశాడో అలాగే ఈ 'కడప' వెబ్ సిరీస్‌లో కూడా మార్పులు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. కడప ప్రజల మనోభావాలని దెబ్బతీయడంతోపాటు పలు సామాజికవర్గాలని కించపర్చేలా దెబ్బతినేలా ఉన్న కడప వెబ్ సిరీస్‌లో మార్పులు చేయని పక్షంలో.. ప్రజలే అతడికి తగిన విధంగా బుద్ధిచెబుతారని మంత్రి హెచ్చరించారు. 

తాను సినిమాల్లో చెప్పాలనుకుని, చెప్పలేకపోయిన విషయాలని చెప్పేందుకే డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టి 'కడప' పేరిట ఈ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాను అని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇటీవలే వర్మ రిలీజ్ చేసిన ఈ వెబ్ సిరీస్ టైటిల్ సాంగ్ సైతం ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. 

 

Trending News