గ్రామ వాలంటీర్ల నుంచి అలాంటి అఫిడవిట్స్ తీసుకోవద్దని ఆదేశాలు

గ్రామ వాలంటీర్ల నుంచి అలాంటి అఫిడవిట్స్ తీసుకోవద్దని ఆదేశాలు

Last Updated : Aug 31, 2019, 11:45 AM IST
గ్రామ వాలంటీర్ల నుంచి అలాంటి అఫిడవిట్స్ తీసుకోవద్దని ఆదేశాలు

గ్రామ వాలంటీర్లుగా నియమితులైన అభ్యర్థుల నుంచి తాము భవిష్యత్తులో చదువుకోబోమంటూ అఫిడవిట్లు తీసుకోవాల్సిందిగా తాము ఆదేశాలు జారీచేయలేదని ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ తెలిపారు. చదువుకునే విద్యార్థులను గ్రామ వాలంటీర్లుగా నియమించకూడదని మాత్రమే ఆదేశించినట్లు గిరిజా శంకర్ స్పష్టంచేశారు. గ్రామ వాలంటీర్లుగా నియమితులైన అభ్యర్థుల నుంచి వారు భవిష్యత్తులో చదువుకోకూడదని అఫిడవిట్లు తీసుకోవాల్సిందిగా పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఆదేశాలు జారీఅయినట్టుగా జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ గిరిజా శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు తాము అలాంటి ఆదేశాలు ఇవ్వనేలేదని, ఆ ప్రచారంలో వాస్తవం లేదని కమిషనర్ తేల్చిచెప్పారు

తమ ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకుని గుంటూరు జిల్లా నకిరికల్లులో గ్రామ వలంటీర్ అభ్యర్థులు నుంచి అఫిడవిట్లు తీసుకున్న ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ సదరు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్టు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ స్పష్టంచేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు కమిషనర్ తెలిపారు.

Trending News