APSRTC Concession: 60 ఏళ్ల వయసు దాటిన వారికి ఆర్టీసీలో 25 శాతం రాయితీ!!

APSRTC Senior Citizen Concession: సీనియర్ సిటిజన్ల కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీలో ప్రయాణించే 60 ఏళ్లు పైబడిన వారికి 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 05:28 PM IST
APSRTC Concession: 60 ఏళ్ల వయసు దాటిన వారికి ఆర్టీసీలో 25 శాతం రాయితీ!!

APSRTC Senior Citizen Concession: సీనియర్ సిటిజన్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 60 ఏళ్లు పైబడిన వారికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన బస్సుల్లో 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సీనియర్ సిటిజన్లకు ఇది వర్తించనుందని ఆయన అన్నారు. 

ఆర్టీసీలో కారుణ్య నియామకాలు

అదే విధంగా ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలను త్వరలోనే చేపడతామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఆర్టీసీతో పాటు గ్రామ, వార్డు సచివాయాలతో పాటు మిగిలిన ప్రభుత్వ శాఖల్లో 1,800 మందిని కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని ఇటీవలే సీఎం జగన్ స్పష్టం చేశారు. దీంతో కారుణ్య నియామకాల భర్తీని ముమ్మరం చేయనున్నట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు. అలాగే.. ఆర్టీసీ బస్సుల్లో సీనియర్​ సిటీజన్లకు 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 

"డీజిల్ ధరలు అంతర్జాతీయంగా పెరిగిపోయాయి. చమురు కంపెనీల నుంచి కొనుగోలు చేసే ఫ్యూయల్ పై పెంపు విధించారు. ఈ క్రమంలో వివిధ బంకుల్లో డీజిల్ కొనుగోలు చేయడం ద్వారా రోజుకు కోటిన్నర రూపాయలకు పైగా ఆదా అవుతుంది. తిరుమల, తిరుపతి, మదనపల్లె, నెల్లూరు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడుపేందుకు నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఆర్టీసీలో ప్రయాణించే 60 పైబడిన వృద్ధులకు 25 శాతం రాయితీని ఏప్రిల్ నుంచి పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాం" అని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.   

Also Read: Hyderabad Bullet Train: విజయవాడ, హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ - విభజన చట్టంలోని హామీని నెరవేర్చాలని డిమాండ్!

Also Read: Ganta Srinivasarao: స్పీకర్ గారూ..ఏడాదిగా పెండింగ్ లో ఉంది.. నా రాజీనామా ఆమోదించండి..: గంటా శ్రీనివాసరావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News