India Champions Trophy Squad Announcement: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మందితో జట్టును వెల్లడించింది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభంకానుంది. టీమిండియా మ్యాచ్ లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. టీమ్‌లో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 13వ తేదీ వరకు అవకాశం ఉంది. ఫిబ్రవరి 6 నుంచి 12 వరకు ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కూడా ఇదే జట్టు కొనసానుంది. బోర్డర్-గవాస్కర్ టోర్నీలో గాయపడిన జస్ప్రీత్ బుమ్రా.. మరో స్టార్ పేసర్ మహ్మద్ షమీ వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు మాత్రం బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ఆడనున్నాడు. శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్ సింగ్ వన్డే జట్టులోకి తొలిసారి ఎంపికయ్యారు. మహ్మద్ సిరాజ్ పేరును సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డికి కూడా నిరాశ ఎదురైంది.
మొత్తం 8 దేశాలు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడనున్నాయి. 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో టీమిండియా, పాకిస్థాన్, కివీస్, బంగ్లాదేశ్ జట్లు, గ్రూప్ Bలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ప్రతి టీమ్ తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో తలపడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 23న మ్యాచ్ ఉంటుంది. న్యూజిలాండ్‌తో మార్చి 2న ఆడనుంది. దాదాపు 8 ఏళ్ల తరువాత ఈ టోర్నీ జరగనుండగా.. 2013లో ధోనీ కెప్టెన్సీలో భారత్ ట్రోఫీని ముద్దాడింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా
Also Read: Kolkata Doctor murder case: సంజయ్ రాయ్ దోషి.. ఆర్జీకర్ ఘటనలో సంచలన తీర్పు వెలువరించిన కోర్టు..
Also Read: Manchu Family: 'నేను ముసలోడిని.. ఇల్లు ఖాళీ చేయించాలి' అని కలెక్టర్‌కు మోహన్ బాబు విజ్ఞప్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter